న్యూఢిల్లి: జర్మనీ విమానయాన సంస్థ లుఫ్తాన్సా ను సిబ్బంది కొరత సమస్య కొరకరాని కొయ్యగా మారింది. ఈ నేపథ్యంలో సమ్మర్ హాలిడేస్ లో నడిపే అనేక విమానాలను యాజమాన్యం రద్దు చేసింది. కరోనా సమయంలో ఈ సంస్త విపరీతమైన నష్టాలను చవిచూసింది. తిరిగి కోలుకు నేలా చేసేందుకు వీలుగా సిబ్బందిని తీసేసింది. దాని ప్రభావం ఇప్పుడు కనిపిస్తోంది. రద్దీకి సరిపడా సేవలను అందించలేకపోతోంది.
కరోనా ఇబ్బంది తొలగిపోవడంతో విమాన సేవలకు బాగా గిరాకీ పెరిగింది. ప్రయాణికుల సంఖ్య పెరగడం శుభమే అయినా సిబ్బంది కొరత సమస్య బాగా ఇబ్బందికరంగా మారిందంటూ వాపోయింది. కరోనా తర్వాత ఎయిర్‌పోర్టులు, గ్రౌండ్ సేవలు, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సేవలు పూర్తిగా మొదలుకాలేదు. టికెట్లు ముందుగానే కొనుగోలు చేసుకున్నవారికి ముందస్తు సమాచారం చేరవేస్తోంది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.