Monday, November 18, 2024

రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ నుంచి ఫ్లెక్సిఫ్యూయల్‌ బుల్లెట్‌.. !

ఇప్పటి వరకూ సంప్రదాయ పద్దతుల్లో బైక్‌లు ఆవిష్కరించిన రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌, పరిస్థితులకు అనుగుణంగా అధునాతన టెక్నాలజీతో సరికొత్త మోటారు సైకిళ్లను రోడ్డెక్కిస్తున్నది. ఇటీవల బుల్లెట్‌ 350 ఆవిష్కరించిన రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌, తాజాగా ప్లెక్స్‌ ఫ్యుయల్‌ మోటారు సైకిళ్ల ఆవిష్కరణలకు సిద్దమైంది. వచ్చే త్రైమాసికంలో ప్లెక్స్‌ ఫ్యుయల్‌ మోటార్‌ సైకిల్‌ ఆవిష్కరించనున్నది. ‘క్లాసిక్‌-350’ బైక్‌ని ప్లెక్స్‌ ఫ్యూయల్‌ బైక్‌గా ఆధునీకరించనుంది. న్యూ-జే-ప్లాట్‌ఫామ్‌ ఇంజిన్‌తో రూపుదిద్దుకున్న క్లాసిక్‌-350 బైక్‌.. ప్లెక్స్‌ ఫ్యుయల్‌కు సపోర్టివ్‌గా ఉంటుందని భావిస్తున్నారు.

క్లాసిక్‌ 350 బైక్‌తోపాటు మీటర్‌ 350, హంటర్‌ 350, బుల్లెట్‌-350 బైక్స్‌ కూడా జే-ప్లాట్‌ఫామ్‌ ఇంజిన్‌తో రూపుదిద్దుకున్నవే. గంతలో హోండా కూడా ప్లెnక్స్‌ ఫ్యుయల్‌ మోటారు సైకిళ్లు ఆవిష్కరిస్తానని ప్రకటించింది. అయితే దేశీయ మార్కెట్లో ప్లెnక్స్‌ ఫ్యుయల్‌ మోటారు సైకిల్‌ ఆవిష్కరించిన సంస్థగా టీవీఎస్‌ మోటార్‌ కంపెనీ నిలుస్తుంది. ఆ సంస్థ 2019లో అపాచీ ఆర్టీఆర్‌ 200 ఎఫ్‌ఐ ఈ100 మోటారు సైకిల్‌ను ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. ఇథనాల్‌, పెట్రోల్‌ మిక్సింగ్‌నే ప్లెnక్స్‌ ఫ్యుయల్‌ అని అంటారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement