యూట్యూబ్‌లో వీడియో ప్రారంభానికి ముందు వచ్చే యాడ్స్ సంఖ్యను రెండు నుంచి ఐదుకు పెంచనుంది. ఈ యాడ్స్‌ను స్కిప్ చేయడానికి వీలుకాదు. త్వరలోనే ఈ తరహా యాడ్స్ కనిపించనున్నాయి. యూట్యూబ్ ఫ్రీ వెర్షన్ ఉపయోగిస్తున్న వారికి ఈ యాడ్స్ కనిపిస్తాయని సంస్థ పేర్కొంది. దీని పై యూజర్లు ఫీడ్ ఇవ్వాలని కూడా యూట్యూబ్ కోరింది. ఇప్పటికే ప్రయోగాత్మకంగా వీటిని రన్ చేస్తున్నారు. దీనిపై పలువురు సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నారు.
యూజర్ల నుంచి వచ్చే ఫీడ్ బ్యాక్ ఆధారంగా అమలు చేసే విషయాన్ని పరిశీలిస్తారు. ఇందులో ఒక్కో యాడ్ 6 సెకండ్ల పాటు ఉంటాయని యూట్యూబ్ తెలిపింది. మొత్తం యాడ్స్ చూసేందుకు 30 నుంచి 35 సెకండ్ల సమయం పట్టే అవకాశం ఉంది. ప్రధానమైన వీడియో చూసేందుకు ఇక నుంచి అంత సమయం వేచి చూడాల్సి ఉంటుంది. ప్రీమియం యూట్యూబ్ యూజర్లకు ఇలాంటి యాడ్స్ ఉండవని సంస్థ పేర్కొంది.