ఫైర్-బోల్ట్ ఇటీవల ఇండియన్ మార్కెట్లో ఫైర్‌బోల్ట్ కంబాట్, ఫైర్-బోల్ట్ గ్రెనేడ్ పేరుతో రెండు స్మార్ట్‌వాచ్‌లను ప్రవేశపెట్టింది. ఇప్పుడు, బ్రాండ్ ఫైర్-బోల్ట్ డెస్టినీ అనే ఆకర్షణీయమైన ప్రీమియమ్ స్మార్ట్‌వాచ్‌ను తాజాగా మార్కెట్ లో లాంచ్ చేసింది. మరి ఈ వాచ్ ఫీచర్లు, స్పెసిఫికేషన్లు, ధర గురించి వివరంగా తెలుసుకుందాం…
వాచ్ ఫీచర్లు, స్పెసిఫికేషన్లు..
ఫైర్-బోల్ట్ డెస్టినీ స్మార్ట్‌వాచ్ పింక్, లైట్ బ్రౌన్, బ్లాక్ & సిల్వర్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉండనుంది. ఈ స్మార్ట్‌వాచ్ ఇవ్వాల (జూలై 11) మధ్యాహ్నం 12 గంటల నుండి కంపెనీ వెబ్సైట్, ఫ్లిప్‌కార్ట్‌లో రూ.1,999 ప్రారంభ ధరతో అందుబాటులోకి వచ్చింది.
స్మార్ట్‌వాచ్ హై-డెఫినిషన్ 1.39 అంగు ఇదిళాల డిస్ప్లేతో వస్తుంది. 360 x 360 పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో క్రిస్టల్క్లియర్ విజువల్ అనుభవాన్ని అందిస్తుంది. ఇన్-బిల్ట్ మైక్రోఫోన్, స్పీకర్‌తో పాటు బ్లూటూత్ కాలింగ్‌కు స్మార్ట్‌వాచ్ సపోర్ట్ చేస్తోంది. దీంతో వినియోగదారులకు కాల్లు చేయడానికి.. స్వీకరించడానికి ఈజీగా ఉంటుంది. దాంతో పాటు హార్ట్ రేట్ మానిటర్, బ్లడ్ ఆక్సిజన్ లెవెల్ కోసం SpO2 ట్రాకింగ్, స్లీప్ ట్రాకింగ్, ఫిమేల్ హెల్త్ ట్రాకింగ్ వంటి ఇతర ఫీచర్లు ఈ స్మార్ట్ వాచ్‌లో ఉన్నాయి.
దీనికి అదనంగా, ఈ అద్భుతమైన స్మార్ట్ వాచ్ అప్లికేషన్ల నుండి స్మార్ట్ నోటిఫికేషన్లకు కూడా మద్దతు ఇస్తుంది. వినియోగదారులు ఈ వాచ్ ద్వారా కెమెరా, మ్యూజిక్ ప్లేబ్యాక్ కంట్రోల్ చేయవచ్చు.. వెదర్ కండీషన్స్ కూడా యాక్సెస్ చేయవచ్చు. ఇది కాకుండా, టైమర్, అలారం, స్టాప్‌వాచ్ వంటి ఆప్షన్స్ కూడా వాచ్‌లో అందుబాటులో ఉన్నాయి. స్మార్ట్ వాచ్ IP67 రేట్ చేయబడింది, అంటే వినియోగదారులు వర్షం సమయంలో కూడా ఈ వాచ్‌ని ఉపయోగించవచ్చు