Saturday, November 23, 2024

ఈనెల 31లోపు ఐటి రిటర్న్స్‌ ఫైల్‌ చేయండి.. ఐటి శాఖ

ఆంధ్రప్రభ, హైదరాబాద్‌ : 2022-23 ఆర్థిక సంవత్సరానికి గత జూలై 31లోపు ఐటి రిటర్న్స్‌ దాఖలు చేయనివారు ఈనెల 31(డిసెంబర్‌)లోపు ఫైల్‌ చేయాలని ఆదాయపన్ను శాఖ తెలిపింది. సవరించిన, ఆలస్యమైన ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ రిటర్న్స్‌ గడువు ముగుస్తున్న నేపథ్యంలో అవసరమైన సమాచారం కోసం వెబ్‌ సైట్‌ లింక్‌ను ఐపి శాఖ అందించింది.

ఇందులో భాగంగా ఒకటి లేదా అంతకంటే ఎక్కువ కరెంట్‌ ఖాతాలలో రూ.కోటి అంతకన్నా ఎక్కువ జమ చేయడం, విదేశాలకు వెళ్లేందుకు రూ.2 లక్షల కంటే అధికంగా వ్యయం చేయడం, విద్యుత్‌ బిల్లుల కోసం రూ.1లక్ష కంటే ఎక్కువ వెచ్చించేవారు తప్పనిసరిగా ఐటి రిటర్న్స్‌ ఫైల్‌ చేయాల్సి ఉంటుంది. ఐటి శాఖ నిర్దేశించిన సమయంలోగా ఆదాయపు పన్ను రిటర్న్స్‌ను ఫైల్‌ చేయని పక్షంలో సెక్షన్‌ 234ఎ కింద వడ్డీ విధించడం, 234ఎఫ్‌ కింద రుసుము,10ఎ,10బి సెక్షన్ల కింద మినహాయింపులకు సంబంధించి అనర్హత, 6-ఎ పార్ట్‌ సి కింద తగ్గింపులు అందుబాటులో ఉండవని ఐటి శాఖ ఉన్నతాధికారులు వివరిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement