Friday, November 22, 2024

HYD: ఫెర్టీ9 ఫెర్టిలిటీ సెంటర్ : తిరుపతిలో ఆశను ఆనందంగా మారుస్తోంది

హైద‌రాబాద్ : మాతృతం అనేది తరచుగా సహజమైన మైలురాయిగా చూస్తుంటారు. కానీ చాలా జంటలకు, ఈ ప్రయాణం మానసికంగా సమస్యలు, వంధ్యత్వానికి సంబంధించిన సామాజిక అపోహలతో నిండి ఉంటుంది. పవిత్ర నగరమైన తిరుపతిలో, జంటలు కుటుంబాన్ని ప్రారంభించాలనే ఒత్తిడిని మాత్రమే కాకుండా సంతానోత్పత్తి సమస్యలకు సంబంధించిన అపోహలను కూడా ఎదుర్కొంటాయి. ప్రామాణిక ఐవిఎఫ్ సంరక్షణ కేంద్రం కోసం పెరుగుతున్న అవసరాన్ని గుర్తించి, ఫెర్టీ9 ఫెర్టిలిటీ సెంటర్ ఇటీవల తిరుపతి వాసులకు అవసరమైన మద్దతును అందించడానికి తమ కేంద్రంను ప్రారంభించింది.

ఈసంద‌ర్భంగా తిరుపతిలోని ఫెర్టీ9 ఫెర్టిలిటీ సెంటర్, ఫెర్టిలిటీ కన్సల్టెంట్ డాక్టర్ సునీత సాధు మాట్లాడుతూ… జీవనశైలి, వైద్యపరమైన కారణాల ప్రభావంతో సంతానోత్పత్తి సవాళ్లను ఎదుర్కొంటున్నారన్నారు. అత్యుత్తమ శ్రేణి విజయశాతంతో ఈ ప్రాంతంలోని జంటలకు తల్లిదండ్రులుగా మారాలనే కలలను సాధించడంలో సహాయ పడటానికి తాము అంకితభావంతో ఉన్నామన్నారు. ప్రదర్శన విండో ఉన్న తిరుపతిలోని ఏకైక కేంద్రం త‌మ ఐవిఎఫ్ ల్యాబ్‌ కావడంతో, రోగులకు వారి చికిత్సలో ఉన్న అధునాతన సాంకేతికత, విధానాలను చూసేందుకు, విశ్వాసం, నమ్మకాన్ని పెంపొందించే వినూత్న అవకాశాన్ని తాము అందిస్తున్నామన్నారు.

ఫెర్టీ9 ఫెర్టిలిటీ సెంటర్, తిరుపతిలోని ఫెర్టిలిటీ కన్సల్టెంట్ డాక్టర్ దీప్తి దామోదర మాట్లాడుతూ… వంధ్యత్వం తెచ్చే మానసిక, శారీరక సవాళ్లను తాము గుర్తించామన్నారు. ఫెర్టీ9 వద్ద అత్యాధునిక పునరుత్పత్తి సేవలను అందరికీ అందుబాటులోకి తీసుకురావడమే త‌మ లక్ష్యమ‌న్నారు. తాము రోగి-కేంద్రీకృత విధానంతో సాంకేతిక శ్రేష్ఠతను మిళితం చేస్తామన్నారు. కరుణ, సంరక్షణతో మాతృత్వం వైపు ప్రతి జంట ప్రయాణానికి మద్దతునిస్తామని భరోశా అందిస్తున్నామన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement