నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) ఇటీవల వాహనాల కోసం ‘వన్ వెహికల్ వన్ ఫాస్ట్ ట్యాగ్’ అనే కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది. దేశవ్యాప్తంగా ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి, టోల్ వసూలును క్రమబద్ధీకరించడానికి ఈ విధానం అమలు చేసింది. అయితే, ఫాస్ట్ ట్యాగ్‌ని యాక్టివేట్ చేయాలనుకుంటే, తప్పనిసరిగా KYCని పూర్తి చేయాలి. KYCని అప్‌డేట్ చేయడానికి ఫాస్ట్ ట్యాగ్ ఈ నెల 29 (ఫిబ్రవరి) వరకు గడువు విధించింది. ఫాస్ట్ ట్యాగ్ KYCని నిర్ణీత గడువులోగా అప్‌డేట్ చేయకపోతే, సంబంధిత ఫాస్ట్ ట్యాగ్ ఖాతాలు డీయాక్టివేట్ చేయబడతాయని గమనించాలి.
- Advertisement -