Tuesday, November 26, 2024

పతనమైన క్రిఎ్టో కరెన్సీ విలువ, 10 శాతం తగ్గిన బిట్‌కాయిన్.. నెట్‌ వర్క్‌ను నిలిపేసిన సెల్సియస్‌

ఒకప్పుడు మార్కెట్‌లో ప్రకంపనలు సృష్టించిన బిట్‌ కాయిన్‌, క్రిఎ్టో కరెన్సీ విలువ భారీగా పతనమైంది. వీటిని కలిగి ఉన్న ఇన్వెస్టర్లు నష్టపోయారు. క్రిఎ్టో కరెన్సీ లెండింగ్‌ ప్లాట్‌ఫామ్‌ సెల్సియస్‌ నెట్‌వర్క్‌ను నిలిపివేయడం, ఖాతాల మధ్య బదిలీలను నిషేధిస్తున్నట్లు ప్రకటించడంతో వీటిని విలువ భారీగా పతనమైంది. ఒక్కో బిట్‌కాయన్‌ విలువ మంగళవారం నాడు 10 శాతం తగ్గి 22,765 డాలర్ల వద్ద ట్రేడయ్యింది. 2021 ఆగస్టులో బిట్‌కాయిన్‌ 68,789 డాలర్ల గరిష్టస్థాయికి చేరింది. ఈ విలువతో పోల్చితే ప్రస్తుతం 66 శాతం పతనమైంది. విలువలో రెండో స్థానంలో ఉన్న క్రిఎ్టో కరెన్సీగా చలామణిలో ఉన్న ఇథేరియం విలవ 8 శాతం తగ్గి ప్రస్తుతం 1225 డాలర్లుగా ఉంది. ద్రవ్యోల్బణ భయాలు, ఫెడరల్‌ బ్యాంక్‌ వడ్డీ రేట్లు పెంచనుందన్న వార్తలు, ఆర్ధిక మాంద్యం ఏర్పడే అవకాశం ఉందన్న హెచ్చరికల నేపథ్యంలో డిజిటల్‌ కరెన్సీ వంటి అధిక రిస్క్‌తో కూడి వాటి నుంచి ఇన్వెస్టర్లు పెట్టుబడులను ఉపసంహరిస్తున్నారు. క్రిఎ్టో కరెన్సీ లెండింగ్‌ ప్లాట్‌ఫామ్‌ సెల్సియస్‌ నెట్‌వర్క్‌ను నిలిపివేయడంతో పాటు, ఖతాల మధ్య బదిలీలను నిలిపివేస్తున్నట్లు ఆదివారంనాడు ప్రకటించింది.

సెల్సియస్‌కు 1.7 మిలియన్ల కస్టమర్లు ఉన్నారు. 10 బిలియన్‌ డాలర్ల ఆస్తులు ఉన్నాయి. నెట్‌వర్క్‌ను ఎప్పడు ప్రారంభించేది ప్రకటించకపోవడంతో క్రిఎ్టో కరెన్సీ విలువపై ప్రభావం పడింది. చాలా కాలంగా సెల్సియస్‌ కస్టమర్ల నుంచి డిపాజిట్లు స్వీకరించి 19 శాతం వరకు రాబడి ఇస్తోంది. ఈ డిపాజిట్లను తిరిగి క్రిఎ్టోలో మదుపు చేసేందుకు రుణాలు ఇస్తోంది. సాధారణ స్టాక్‌ మార్కెట్లతో పోల్చితే క్రిఎ్టోకరెన్సీలో పెట్టుబడులకు గణనీయమైన రాబడి వస్తోంది. అనేక దేశాలు క్రిఎ్టో కరెన్సీ విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్నాయి. సెల్సియస్‌పై కూడా నిఘా తీవ్రమైంది. ఈ నేపథ్యంలోనే సంస్థ నెట్‌వర్క్‌ను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement