Saturday, November 16, 2024

జీశాట్‌ను మోసుకెళ్లనున్న ఫాల్కన్‌-9

భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) త్వరలో జీశాట్‌ ఎన్‌-2 ఉపగ్రహాన్ని నింగిలోకి పంపనున్నది. ఈ క్రమంలో ఇస్రో తొలిసారి ఎలాన్‌ మస్క్‌కు చెందిన స్పేస్‌ఎక్స్‌ సంస్థ సహాయం తీసుకోనున్నది. స్పేస్‌ఎక్స్‌ ఫాల్కన్‌ 9 రాకెట్‌ సహాయంతో భారీ ఉపగ్రహాన్ని నింగిలోకి ప్రవేశపెట్టాలని యోచిస్తున్నది.

ప్రస్తుతం ఇస్రో భారీ ఉపగ్రహాలను మార్క్‌-3 రాకెట్‌ ద్వారా నింగిలోకి తీసుకెళ్తుంది. మార్క్‌-3 రాకెట్‌ 4వేల కిలోల బరువున్న ఉపగ్రహాలను మాత్రమే భూస్థిర కక్ష్యలో ప్రవేశపెట్టగలదు.

అయితే, ఇస్రో కమ్యూనికేషన్‌ శాటిలైట్‌ అయిన జీశాట్‌ ఎన్‌2ని నింగిలోకి తీసుకెళ్లాల్సి ఉంది. ఈ రాకెట్‌ 4700 కిలోల బరువు ఉంటుంది. ఈ క్రమంలో ఇస్రో మొదటిసారి స్పేస్‌ఎక్స్‌ సహాయం కోరుతున్నది.

స్పేస్‌ఎక్స్‌ రాకెట్‌ని ఉపయోగించుకొని ఇస్రో చేపడుతున్న తొలి వాణిజ్యపరమైన ఉపగ్రహ ప్రయోగం ఇదేకావడం విశేషం. జీశాట్‌-ఎన్‌2 శాటిలైట్‌ విమానాల్లో ఇంటర్నెట్‌ సేవలు అందించేందుకు ఉపయోగపడుతుంది. అలాగే, మారుమూల ప్రాంతాలకు ఇంటర్నెట్‌ సేవల విస్తరణకు దోహదపడుతుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement