Sunday, November 24, 2024

FASTag | ఫాస్టాగ్‌ కేవైసీ గడువు పొడిగింపు !

నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) వాహనదారులకు శుభవార్త చెప్పింది. రహదారి టోల్‌ వసూలుకు సంబంధించిన ఫాస్టాగ్‌ కేవైసీ అప్‌డేట్‌ గడువును పొడిగించింది. వాహనదారులు తమ ఫాస్టాగ్‌ అకౌంట్లకు ఫిబ్రవరి 29వ తేదీలోపు కేవైసీ అప్‌డేట్‌ చేసుకోవాలని తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఫాస్టాగ్‌ కేవైసీ అప్‌డేట్‌ కోసం గతంలో విధించిన గడువు జనవరి 31తో ముగియగా ఎన్‌హెచ్‌ఏఐ మరోసారి పొడిగించింది.

జాతీయ రహదారులపై సాఫీగా, నిరంతరాయమైన టోల్ చెల్లింపు అనుభవం కోసం సకాలంలో కేవైసీ అప్‌డేట్‌ చేసుకోవాల్సిన ఆవశ్యకతను ఎన్‌హెచ్‌ఏఐ తెలియజేసింది. కమర్షియల్ లేదా ప్రైవేట్ వాహనాలు ఉన్నవారు ఎలక్ట్రానిక్ టోల్ వసూలు వ్యవస్థలో ఎలాంటి అంతరాయాలను నివారించడానికి వెంటనే కేవైసీ అప్‌డేట్‌ చేసుకోవడం చాలా అవసరం.

ఫిబ్రవరి 29 గడువులోపు కేవైసీ వివరాలను అప్‌డేట్ చేయడంలో విఫలమైతే ఫాస్ట్‌ట్యాగ్ అకౌంట్‌ పనిచేయకుండాపోవచ్చు. కేవైసీ వివరాలను అప్‌డేట్‌ చేసుకునేందుకు వాహన యజమానులు వాహన రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, డ్రైవింగ్ లైసెన్స్, పాన్, ఓటరు ఐడీ కార్డ్ వంటి ప్రూఫ్స్‌తో సహా నిర్దిష్ట పత్రాలను సమర్పించాలి. అదనంగా, ఆధార్ కార్డ్, పాస్‌పోర్ట్, పాస్‌పోర్ట్-సైజ్ ఫోటోగ్రాఫ్‌లు వంటివి చిరునామా రుజువు ప్రక్రియకు అవసరం.

Advertisement

తాజా వార్తలు

Advertisement