భారత్ నుంచి యాపిల్ ఐఫోన్ల ఎగుమతులు భారీగా పెరుగుతున్నాయి. 2024లో భారత్ నుంచి 1.08 లక్షల కోట్ల రూపాయల విలువైన ఐఫోన్లను యాపిల్ కంపెనీ ఎగుమతి చేసింది. వార్షికంగా ఐఫోన్ల ఎగుమతులు 42 శాతం పెరిగాయి. దేశీయ ఉత్పత్తి 46 శాతం పెరిగి 1.48 లక్షల కోట్లు (17.5 బిలియన్ డాలర్లు)కు పెరిగింది. ప్రధానంగా స్థానిక వాల్యూ ఎడిషన్‌కు కంపెనీ 15-20 శాతం వరకు పెంచింది.
దేశీయంగా తయారీ రంగాన్ని మరింత పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక (పీఎల్‌ఐ) స్కీమ్ గణనీయమైన ఫలితాలు ఇస్తోంది. ఉత్పత్తి, ఎగుమతులు, ఉద్యోగాల కల్పనలో ఈ స్కీమ్ మంచి ఫలితాలు ఇస్తోంది.
ఫ్యాక్స్‌కాన్, పెగాట్రాన్, విస్ట్రాన్ వంటి కంపెనీలు రావడంలో 1,85,000 ప్రత్యక్ష ఉద్యోగాలు లభించాయి. వీరిలో 70 శాతానికి పైగా మహిళా ఉద్యోగులు ఉన్నారు. దేశీయంగా అత్యధికంగా బ్లూకాలర్ ఉద్యోగాల కల్పించే సంస్థగా యాపిల్ నిలిచింది.
యాపిల్ మన దేశంలో 2023లో 12 బిలియన్ డాలర్ల విలువైన ఐఫోన్లను ఉత్పత్తి చేసింది. ఇందులో 9 బిలియన్ డాలర్ల విలువైన ఫోన్లను ఎగుమతి చేసింది. మరికొన్ని సంవత్సరాల్లోనే యాపిల్ మన దేశంలో 30 బిలియన్ డాలర్ల వార్షిక ఉత్పత్తిని చేరుకుంటుందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
దేశీయంగా కూడా మార్కెట్‌ను విస్తృతం చేసేందుకు యాపిల్ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ప్రస్తుతం భారత్ రెండో అతి పెద్ద
స్మార్ట్ ఫోన్ల మార్కెట్‌గా ఉంది. యాపిల్ ఫోన్ల అమ్మకాల పరంగా చూస్తే భారత్ 4వ స్థానంలో ఉంది. అమెరికా అగ్రస్థానంలో ఉంటే, జపాన్, యూకే రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి.
ఈ సంవత్సరంలో దేశంలో ఐఫోన్ల అమ్మకాలు 20 శాతం పెరిగి 15 మిలియన్ యూనిట్లకు చేరుతాయని అంచనా వేస్తున్నారు. యాపిల్‌కు అతి పెద్ద మార్కెట్‌గా ఉన్న చైనాలో క్రమంగా అమ్మకాలు తగ్గుతున్నాయి. ప్రధానంగా హువాయ్ ఐఫోన్లకు గట్టి పోటీ ఇస్తోంది. దీంతో యాపిల్ వేగంగా వృద్ధి చెందుతున్న భారత్ మార్కెట్‌పై కేంద్రీకరింస్తోంది.
దేశం నుంచి 12.8 బిలియన్ డాలర్ల విలువైన ఐఫోన్ల ఎగుమతుల్లో ఫ్యాక్స్‌కాన్ వాటా 54 శాతం, టాటా ఎలక్ట్రానిక్స్ వాటా 29 శాతం, పెగట్రాన్ 17 శాతంగా ఉన్నాయి. ఇటీవల పెగట్రాన్‌ను టాటా ఎలక్ట్రానిక్స్ కొనుగోలు చేసింది.
తమిళనాడులో ఉన్న ఐఫోన్లను తయారు చేస్తున్న ఫాక్స్‌కాన్‌లో 42 వేల మంది పని చేస్తున్నారు. వీరిలో 30 వేల మంది మహిళా ఉద్యోగులు ఉన్నారు. చైనాపై ఆధారపడటాన్ని క్రమంగా తగ్గించుకుంటూ, ఇండియాలో స్థానిక తయారీ కంపోనెంట్స్‌ను వినియోగాన్ని పెంచాలని యాపిల్ నిర్ణయించింది.