డేటా, టెక్నాలజీ మార్కెట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో సేవలు అందిస్తున్న ఇంటర్కాంటినెంటల్ ఎక్స్ఛేంజ్ (ఐసీఈ) కీలక ప్రకటన చేసింది. భారత్లో తమ వ్యాపార విస్తరణకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు తెలిపింది. సాఫ్ట్వేర్ ఇంజినీరింగ్, కస్టమర్ సక్సెస్తో పాటు ఆటోమేషన్ కార్యకలాపాలను విస్తరింపజేయడానికి ఐసీఈ ఎగ్జిక్యూటివ్ బృందం.. ఈ వారం పూణేను సందర్శించినట్టు తెలిపింది. 2019, హైదరాబాద్లో ఐసీఈ భారత్లో సుమారు 500 మంది ఉద్యోగులతో ఏర్పాటైందని, ఇప్పుడు 900కు చేరుకుందని వివరించింది. తమ ఆఫీస్ స్పేస్ కూడా రెట్టింపు అయినట్టు ప్రకటించింది. 1,75,000 స్క్వేర్ ఫీట్స్లో సేవలు అందిస్తున్నామని ఐసీఈ ఇండియా హెడ్ సచిన్ పాటి తెలిపారు.
పూణేలో ఐసీఈ మార్ట్గేజ్ టెక్నాలజీ 2000లో ప్రారంభమైందని, దాదాపు 1,100 మంది ఉద్యోగులు సేవలు అందిస్తున్నట్టు వివరించారు. రెండు కొత్త ఫ్లోర్స్ సేవలకు జోడించామని చెప్పారు. గడిచిన మూడేళ్లలో ఎంతో వృద్ధి సాధించామని వివరించారు. దేశ వ్యాప్తంగా ఉన్న ఐసీఈ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ (జీసీసీ)లో 2000కు పైగా సాఫ్ట్వేర్ ఇంజినీర్లు సేవలందిస్తున్నారు. తమ పెట్టుబడి సరికొత్త సాంకేతిక వ్యవస్థ రూపొందించడానికి దోహద పడుతుందని ఐసీఈ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ మయూర్ కపానీ తెలిపారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..