ప్రముఖ వాహన తయారీ సంస్థ ఇగ్నీట్రాన్ మోటోకార్ప్‌కు చెందిన స్వదేశీ ఈవీ స్టార్టప్ సైబోర్గ్ తన 3 ఎలక్ట్రిక్ బైకులు యోడా, జీటీ 120, బాబ్-ఈలకు సంబంధించిన ధరలను ప్రకటించింది. యోడా ధరను రూ.1,84,999గా, జీటీ 120 ధరను రూ.1,64,999గా, బాబ్-ఈ ధరను రూ.1,14,999గా నిర్ణయించింది. వివిధ రాష్ట్రాల్లో లభించే అదనపు సబ్సిడీల కారణంగా వినియోగదారులకు మరింత తక్కువ ధరకు లభించే అవకాశాలున్నాయని కంపెనీ తెలిపింది. ఇష్టమైన వాహనాన్ని రూ.999 చెల్లించి.. బైక్‌ను బుక్ చేసుకునే అవకాశాన్ని కూడా కంపెనీ కల్పించింది. మేడ్ ఇన్ ఇండియా తొలి ఎలక్ట్రిక్ క్రూయిజర్ యోడా 3.24 కేడబ్ల్యూహెచ్ లిథియం-అయాన్ బ్యాటరీతో వస్తున్నది. గంటకు 90 కి.మీ వేగాన్ని అందుకుంటుంది.
ఒక్కసారి చార్జింగ్ చేస్తే.. 150 కి.మీ వెళ్లొచ్చు. ఫుల్ చార్జింగ్‌కు 4-5 గంటల సమయం పడుతుంది. బాబ్-ఈ 2.88 కేడబ్ల్యూహెచ్ లిథియం-అయాన్ బ్యాటరీతో వస్తుంది. గరిష్ట వేగం గంటకు 85 కి.మీ. ఒకసారి చార్జింగ్ చేస్తే.. 110 కి.మీ వరకు వెళ్లొచ్చు. ఫుల్ చార్జింగ్‌కు 4-5 గంటల సమయం పడుతుంది. సైబోర్గ్ జీటీ 120 ఎలక్ట్రిక్ స్పోర్ట్ ్స బైక్ 4.32 కిలోవాట్ అవర్ సామర్థ్యం కలిగిన లిథియం అయాన్ బ్యాటరీతో వస్తున్నది. ఇది 6 కిలోవాట్ల సామర్థ్యాన్ని అందిస్తుంది. ఒకసారి చార్జింగ్ చేస్తే.. 180 కి.మీ వెళ్తుంది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..