Tuesday, November 26, 2024

అక్టోబర్‌లో లక్ష దాటిన ఈవీ రిజిస్ట్రేషన్లు.. ఇంత పెద్ద‌మొత్తంలో ఇదే ఫ‌స్ట్‌

దేశవ్యాప్తంగా విద్యుత్‌ వాహన రిజిస్ట్రేషన్లు అక్టోబరులో లక్ష దాటాయి. ఒక నెలలో లక్ష పైబడి విద్యుత్‌ వాహనాల రిజిస్ట్రేషన్లు జరగడం ఇదే ప్రథమం. అలాగే వరుసగా ఐదో నెల కూడా ఈ విభాగంలో రిజిస్ట్రేషన్లలో వృద్ధి నమోదయింది. విద్యుత్‌ టూ వీలర్‌ విభాగంలో అద్భుతమైన వృద్ధి ఇందుకు కారణం.

అక్టోబరులో మొత్తం 1,14,001 విద్యుత్‌ వాహనాల రిజిస్ట్రేషన్‌ జరిగింది. గత ఏడాది అక్టోబరు రిజిస్ట్రేషన్లతో పోల్చితే 190 శాతం వృద్ధి ఏర్పడింది. వీటిలో 66 శాతం విద్యుత్‌ టూ వీలర్లున్నాయి. మొత్తం 75,294 విద్యుత్‌ టూ వీలర్లు అమ్ముడుపోయాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement