Monday, November 18, 2024

EV car sales | ఈవీ కార్ల విక్రయాల్లో హ్యుందయ్‌, కియా జోరు !

దక్షిణ కొరియాకు చెందిన కార్ల తయారీ సంస్థలు హ్యుందయ్‌, కియా విక్రయాలు గతేడాది డిసెంబర్‌ నాటికి 15 లక్షల యూనిట్లు దాటాయి. హ్యుందయ్‌ తన మొదటి ఈవీ మోడల్‌ బ్లూఆన్‌ను ఐ10 మినీ కారు ఆధారంగా దేశీయ విపణిలో విడుదల చేసింది. హ్యుందాయ్‌, కియా 2023లో 5,16,441 కార్లను విక్రయించాయి, గత ఏడాది చివరినాటికి వారి ఈవీ అమ్మకాలు 15 లక్షల యూనిట్ల మార్కును చేరాయని కంపెనీల డేటా చూపించిందని యోన్‌హాప్‌ వార్తా సంస్థ నివేదించింది.

హ్యుందాయ్‌ 10 ఈవీలలో 8, కియా ఈవీలు గతేడాది విదేశాల్లో విక్రయించబడ్డాయి. అత్యధికంగా అమ్ముడైన మోడళ్లలో హ్యుందాయ్‌కి చెందిన కోనా ఎలక్ట్రిక్‌, ఐయానిఖ్‌ 5, కియా బ్రాండ్లు నీరో, ఈవీ6లు ఉన్నాయి. 2024లో, హ్యుందాయ్‌ 4.24 మిలియన్‌ ఆటోలను విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకుంది. గత ఏడాది 4.21 మిలియన్ల కంటే కొంచెం ఎక్కువ. అలాగే కియా 3.2 మిలియన్‌ యూనిట్లను విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ రెండూ కలిసి టయోటా మోటార్‌ కార్పోరేషన్‌, వోక్స్‌వ్యాగన్‌ గ్రూప్‌ తర్వాత అమ్మకాల ద్వారా ప్రపంచంలో మూడవ అతిపెద్ద కార్ల తయారీ సంస్థగా ఏర్పడ్డాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement