Tuesday, November 26, 2024

కారు బీమాలో ఇంజిన్‌కు రక్షణ..

చాలా మంది జీవితంలో కారు ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంటుంది. తమ కారును అందుకే ఎప్పుడూ సురక్షితంగా, మంచి కండిషన్‌లో ఉంచాలని కోరుకుంటారు. వాహనాన్ని రక్షించుకోవడానికి సమగ్రమైన మోటార్‌ బీమా తిరుగులేని ఆయుధం. ఇది మనకు కవచంలా పని చేస్తుంది. నీటిలో మునిగిపోవడం, గాలివాన, వరదలు, తుఫాన్‌, కొండచరియలు విరిగిపడటం, రాళ్లు దొర్లడం, భూకంపాలు వంటి సంఘటనల నుంచి వాహనానికి బీమా రక్షణ కల్పిస్తుంది. దీంతో పాటు ప్రమాదం, అల్లర్ల సమయంలో జరిగే నష్టాల నుంచి కూడా ఇది రక్షణ కవచంలా పని చేస్తుంది. వీటితో పాటు కొన్ని బీమా పథకాలతో యాన్‌ ఆన్‌ కవర్స్‌ సదుపాయాన్ని కల్పిస్తున్నాయి.

కారు ఇంజిన్‌ వాహనంలో అత్యంత విశిష్టమైన భాగం, కారుకు ఇది వెన్నెముక లాంటిది. దీని ప్రాధాన్యతను బీమా రంగం గుర్తించింది. అందుకే ఇంజిన్‌ ప్రొటెక్షన్‌ కవర్‌ను యాడ్‌ ఆన్‌ కవర్‌ ద్వారా మోటారు బీమా దీనికి రక్షణ కల్పిస్తుంది. ఇంజిన్‌ ప్రొటెక్షన్‌ యాడ్‌ ఆన్‌ కవర్‌ను ఎవరైనా సమగ్రమైన మోటారు బీమా పాలసీతో పాటు కొనుగోలు చేయవచ్చుని బజాజ్‌ అలియన్జ్‌ జనరల్‌ ఇన్సూరెన్స్‌ ఛీప్‌ డిస్ట్రిబ్యూషన్‌ ఆఫీసర్‌ ఆదిత్య శర్మ తెలిపారు. ఇంజిన్‌ దెబ్బతినడం వల్ల కలిగే నష్టాల నుంచి ఇది రక్షణ కల్పిస్తుంది. హైడ్రోస్టాటిక్‌ లాక్‌, ఆయిల్‌ లీకేజీ వల్ల కలిగే నష్టాల నుంచి రక్షణ కల్పిస్తుంది. ఇంజిన్‌లోకి నీరు చేరడం వల్లే కలిగే నష్టాలను కవర్‌ చేస్తుంది. ఇంజిన్‌లో ఉండే అనేక విడిభాగాల రిపేర్‌, కొత్తవాటని అమర్చడానికి అయ్యే ఖర్చును ఈ బీమా పాలసీ భరిస్తుందని ఆయన వివరించారు. సమగ్రమైన మోటారు బీమా పాలసీ ఉంటేనే ఇంజిన్‌ ప్రొటెక్షన్‌ కవరును పొందకలుగుతారు. థర్డ్‌ పార్టీ బీమా మాత్రమే కలిగి ఉంటే ఈ యాడ్‌ ఆన్‌ కవర్‌ను కొనుగోలు చేసేందుకు అవకాశం ఉండదు.

10 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సున్న కార్లకు కూడా ఇంజిన్‌ కవరేజీ పాలసీని తీసుకోవడం కుదరదు. అదనపు ఖర్చుతో ఇంజిన్‌ కవరేజీని తీసుకోవచ్చు. కారు కలిగి ఉన్న ప్రతి ఒక్కరూ ఇంజిన్‌ కవరేజీ ఉన్న బీమా పాలసీ యాడ్‌ ఆన్‌ కవరీని తీసుకోవాలని ఆయన సూచించారు. ముఖ్యంగా ఎక్కువ వరదలు వచ్చే ప్రాంతాల్లో ఉండేవారు. వరద ప్రాంతాలను ఎక్కువ ప్రయాణాలు చేసేవారు తప్పనిసరిగా దీన్ని తీసుకోవాలని కోరారు. వరదల సమయంలో ఇంజిన్‌లోని నీరు చేయడం వల్ల ఎక్కువ నష్టం జరుగుతుంది. ఇంజిన్‌ ప్రొటెక్షన్‌ కోసం యాడ్‌ ఆన్‌ కవరేజీ పాలసీని తీసుకోవాలని ఆయన సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement