Friday, November 22, 2024

షియోమీపై ఈడీ దాడి, 5,551 కోట్ల జరిమానా..

స్మార్ట్‌ఫోన్‌ తయారీరంగంలో అగ్రగామిగా నిలిచిన షియోమీ టెక్నాలజీ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌కు ఈడీ షాక్‌ ఇచ్చింది. ఈ కంపెనీకి చెందిన సుమారు రూ.5,551 కోట్ల విలువైన ఆస్తులను సీజ్‌ చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఫోరెక్స్‌ ఉల్లంఘనలకు షియోమీ కంపెనీ పాల్పడినట్లు తేలడంతో ఈ నిర్ణయం తీసుకుంది. స్మార్ట్‌ఫోన్‌ రంగంలో షియోమీ అగ్రగామిగా కొనసాగుతోంది. అయితే విదేశీ మారకంలో ఆ కంపెనీ అక్రమాలకు పాల్పడినట్లు ఈడీ గుర్తించింది. దీంతో ఆ కేసులో ఈడీ చర్యలకు దిగినట్లు తెలిసింది. రూ.5000 కోట్లను ఆ కంపెనీ బ్యాంక్‌ అకౌంట్ల నుంచి సీజ్‌ చేశారు. ఫెమా చట్టం కింద ఆ డబ్బులను సీజ్‌ చేసినట్లు ఈడీ వెల్లడించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో షియోమీ కంపెనీ అక్రమ రీతిలో డబ్బులు చెల్లించినట్లు ఈడీ తన విచారణలో గుర్తించింది. షియోమీ కంపెనీ 2014 నుంచి తన కార్యకలాపాలను ప్రారంభించింది.

ఆ మరుసటి ఏడాది నుంచే కంపెనీ అక్రమంగా నిధులను ఇతర దేశాలకు తరలించినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో కేసు నమోదు చేసిన ఈడీ దర్యాప్తు ప్రారంభించింది. గత కొన్నేళ్లుగా రూ.5551.27 కోట్ల సమానమైన విదేశీ నిధులను మూడు ఇతర దేశాల్లో పని చేస్తున్న మూడు సంస్థలకు అక్రమంగా పంపించినట్లు ఈడీ ఓ ప్రకటన విడుదల చేసింది. బ్యాంకులను తప్పుదోవ పట్టించి ఈ నిధులను విదేశాలకు చేరవేసినట్లు వెల్లడించింది. షియోమి గ్రూప్‌తోపాటు అమెరికాలో ఉన్న మరో రెండు సంస్థలకు ఈ నిధులు చేరినట్లు వెల్లడించారు. ఆ సంస్థల నుంచి ఎలాంటి సర్వీసు పొందకుండానే ఈ నగదును పంపించినట్లు ఈడీ గుర్తించింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement