Friday, November 22, 2024

ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌కు షావోమీ స్వస్తి.. ఎంఐపే, ఎంఐ క్రెడిట్​ వంటివి ఉండవిక..

భారత్‌లో ఫైనాన్సియల్‌ సర్వీసులను నిలిపివేసింది. ఎంఐ పే, ఎంఐ క్రెడిట్‌ పేరిట అందిస్తున్న ఆర్ధిక సేవల నుంచి వైదొలుగుతున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఈ యాప్స్‌ను ప్లే స్టోర్‌తో పాటు, సొంత యాప్‌ స్టోర్‌ నుంచి కూడా తొలగించింది. ఇప్పటికే ఈ కంపెనీ ఫోన్లలో ఉన్న యాప్స్‌ను ఓపెన్‌ చేసినప్పుడు పని చేయడంలేని సందేశం వస్తోంది. ప్రధానమైన మొబైల్స్‌ వ్యాపారంపై దృష్టి కేంద్రీకరించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. భవిష్యత్‌లో కొత్త ఆవిష్కరణలు, ఉత్పత్తులతో మందుకొస్తామని తెలిపింది.

షావోమీ 2019లో ఎంఐ పే సర్వీస్‌ను తీసుకు వచ్చింది. తరువాత ఎంఐ క్రెడిట్‌ను ప్రాంరభించింది. ఎంఐ పే ద్వారా బిల్‌ పేమెంట్స్‌, మనీ ట్రాన్స్‌ఫర్‌ వంటి సదుపాయాలను వినియోగదారులకు అందించింది. ఎంఐ క్రెడిట్‌ ద్వారా వినియోగదారులకు రుణ సదుపాయం కల్పించింది. చైనా తరువాత షావోమీకి మన దేశం అతిపెద్ద మార్కెట్‌గా ఉంది. ఇటీవల విడుదలైన ఓ నివేదిక ప్రకారం ఈ సంవత్సరం మూడో త్రైమాసికంలో కంపెనీ మొబైల్‌ మార్కెట్‌లో అగ్రస్థానంలో ఉంది. కంపెనీ ఆర్ధిక అవకతవకలకు పాల్పడిందన్న ఆరోపణలతో 5,551 కోట్ల డిపాజిట్లను ఈడీ సీజ్‌ చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement