Tuesday, November 26, 2024

ఫాగ్సీ భాగస్వామ్యంతో ఎంవోకల్‌.. మహిళల ఆరోగ్యంపై విస్తృత ప్రచారం

న్యూఢిల్లి : మహిళల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రముఖ ఫార్మా సంస్థ ఎంక్యూర్‌ ఫార్మాస్యూటికల్స్‌ ఎంవోకల్‌ కార్యక్రమాన్ని ప్రారంభించింది. మహిళలు తీవ్రంగా రక్తహీనత, తల్లిపాలు, రుతుస్రావం వంటి సమస్యలు ఎదుర్కొంటున్నారని, ఈ నేపథ్యంలో ఫెడరేషన్‌ ఆఫ్‌ అబ్‌స్టెట్రిక్స్‌ అండ్‌ గైనకాలజీ ఆఫ్‌ ఇండియా (ఫాగ్సీ) భాగస్వామ్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నది. ఈ సందర్భంగా ఎంక్యూర్‌ ఫార్మాస్యూటికల్స్‌ అధ్యక్షులు-ఇండియా బిజినెస్‌ హెడ్‌ ప్రతిన్‌ వీటీ మాట్లాడారు. ఏఆర్‌, వ్యక్తిగత డిజిటల్‌ అసిస్టెంట్‌ వంటి కార్యక్రమాల ద్వారా భారత్‌ వ్యాప్తంగా కోటి మంది మహిళలను చేరుకోవడాన్ని లక్ష్యంగా చేసుకున్నామన్నారు. ఎంక్యూర్‌ ఫార్మాస్యూటికల్స్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ నమిత థాపర్‌ మాట్లాడుతూ.. ఎంవోకల్‌ ప్రచారం ప్రస్తుతం హిందీ, ఇంగ్లీష్‌, ఒడిశా, మరాఠీ, తమిళ్‌, తెలుగు, కన్నడ, మలయాళం, బెంగాలీ భాషల్లో లభ్యం అవుతుందన్నారు.

మహిళల ఆరోగ్యంపట్ల ఎన్నో అపోహలు ఉన్నాయని, అవగాహన లేమి దీనికి కారణమని అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో ఎంవోకల్‌ కార్యక్రమం ప్రారంభించడం పట్ల సంతోషంగా ఉందన్నారు. మహిళలు తమంతట తాము సమాచారం పొందడంతో పాటు డాక్టర్లతో చర్చించే అవకాశం లభిస్తుందన్నారు. మహిళలు తమ ఆరోగ్య సమస్యలు వివరించేందుకు కొంత అసౌకర్యానికి గురవుతుంటారని, ఎంవోకల్‌తో అవసరమైన సమాచారం అందించడం జరుగుతుందని ఎంక్యూర్‌ ఫార్మాస్యూటికల్స్‌ మార్కెటింగ్‌ అండ్‌ పోర్ట్‌ఫోలియో స్ట్రాటజీ సీనియర్‌ డైరెక్టర్‌ సౌరభ్‌ గంభీర్‌ తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement