Saturday, November 23, 2024

మొదటి స్థానంలో జెఫ్ బెజోస్‌, మూడవ స్థానంలో ఎలాన్ మస్క్

ప్రపంచ కుబేరుల జాబితాలో రెండవ స్థానం నుంచి మూడవ స్థానానికి పడిపోయారు టెస్లా అధినేత ఎలాన్ మస్క్. ఆ స్థానంలోకి ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వస్తువులు తయారు చేసే ఎల్‌వీఎంహెచ్ సంస్థ అధినేత బెర్నార్డ్ అర్నాల్ట్ వచ్చారు. కాగా మొదటి స్థానంలో ఇప్పటికీ అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్‌నే ఉన్నారు. బ్లూమ్‌బర్గ్ బిలియనీర్ నివేదిక ప్రకారం.. జనవరిలో ప్రపంచ అపర కుబేరుడిగా మొదటి స్థానంలోకి వచ్చారు మస్క్. అయితే కొద్ది రోజులకే మళ్లీ రెండవ స్థానంలోకి పడిపోయారు. జనవరి నుంచి నేటికి మస్క్ సంపాదనలో 24 శాతం తేడా ఉందని బ్లూమ్‌బర్గ్ బిలయనీర్ నివేదిక పేర్కొంది. ఇకపోతే, మస్క్ చేసే ట్వీట్లు కూడా ఆయన సంపాదనపై వ్యత్యాసాలను చూపుతున్నాయని అంటున్నారు. బిట్ కాయిన్‌పై మస్క్ చేసిన ట్వీట్ల ద్వారా, బిట్ కాయిన్ విలువ కొంత వరకు తగ్గింది. అయితే మస్క్ అదృష్టం మాత్రం అలాగే కొనసాగుతోంది

Advertisement

తాజా వార్తలు

Advertisement