మరో సంవత్సర కాలంలో ఎలక్ట్రికల్ వాహనాల ధరలు పెట్రోల్ వాటితో సమానంగా దిగివస్తాయని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు. శుక్రవారం నాడు ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఇథనాల్ ఉత్పత్తిని పెంచేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని చెప్పారు. విద్యుత్ వాహనాల వాడకం పెరిగితే పెట్రోల్, డిజీల్‌పై పెడుతున్న ఖర్చు గణనీయంగా తగ్గుతుందని చెప్పారు. రోడ్ ట్రాన్స్‌పోర్టు కంటే వాటర్ ట్రాన్స్‌పోర్టు ఎంతో చవకని చెప్పారు.
ప్రభుత్వం పెద్ద ఎత్తున వాటర్ వేస్‌ను అభివృద్ధి చేస్తుందని చెప్పారు. విద్యుత్ వాహనాల ఉత్పత్తి, వినియోగం పెంచేందుకు ప్రభుత్వం అనేక ప్రోత్సహకాలను అందిస్తుందని, త్వరలోనే వీటి ఉత్పత్తి గణనీయంగా పెరుగుతుందన్నారు. వినియోగదారులు ఇప్పుడిప్పుడే వీటి వినియోగం పట్ల ఆసక్తి చూపిస్తున్నారని చెప్పారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.