Friday, November 15, 2024

HYD: క్యాన్సర్‌తో బాధపడుతున్న వృద్ధునికి సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్ లో చికిత్స‌ విజ‌య‌వంతం

హైదరాబాద్‌ : హైదరాబాద్‌లోని సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ (ఏఓఐ) ఎసెండింగ్ కోలన్ (పెద్దప్రేగులో భాగం అండ్ ఉదరంలో కుడి వైపున పై దిశగా ఉంటుంది) క్యాన్సర్‌తో బాధపడుతున్న 93ఏళ్ల వ్యక్తికి విజయవంతంగా చికిత్స అందించింది.

గత రెండు నెలలుగా కడుపు నొప్పి, బరువు తగ్గడం వంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్న‌ ఘీసారంను క్షుణ్ణంగా పరీక్షించిన తరువాత అత్యంత క్లిష్టమైన లాపరోస్కోపిక్ అసిస్టెడ్ రాడికల్ రైట్ హెమీ కోలెక్టమీని నిర్వహించింది. దీనిలో భాగంగా పెద్దప్రేగు కుడి వైపు భాగాన్ని కొంత తీసివేసి, పేగులోని మిగిలిన భాగాలను తిరిగి కనెక్ట్ చేసింది. రోగి వయస్సు ఎక్కువగా ఉండటం ఈ శస్త్ర చికిత్సలో ఒక ప్రత్యేకమైన సవాలును అందించింది. అయితే ఏఓఐలోని నిపుణుల బృందం ఈ ప్రక్రియను అత్యంత ఖచ్చితత్వంతో జాగ్రత్తగా నిర్వహించగలిగింది. రోగి స్థిరంగా కోలుకున్నారు. ఫలితంగా చికిత్స చేసిన అనంతరం 5వ రోజున అతనిని డిశ్చార్జ్ చేశారు.

భారతదేశం అంతటా క్యాన్సర్ సంరక్షణను అభివృద్ధి చేయడంలో ఇటువంటి ఫలితాల ప్రాముఖ్యతను సిటిఎస్ఐ – దక్షిణాసియా సీఈఓ – హరీష్ త్రివేది మాట్లాడుతూ… ఈ కేసు ఏఓఐలో నైపుణ్యం, ఆవిష్కరణలను హైలైట్ చేస్తుందన్నారు. క్యాన్సర్ చికిత్సలో నూతన ప్రమాణాలను చేయడం కొనసాగించడమే త‌మ లక్ష్యమ‌న్నారు. శ్రీ ఘీసారం విజయవంతమైన ఫలితం రోగులకు వారి వయస్సు లేదా ఆరోగ్య పరిస్థితితో సంబంధం లేకుండా మెరుగైన వైద్యం అందించడంలో తమ నిబద్ధతను ప్రతిబింబిస్తుందన్నారు.

- Advertisement -

రీజినల్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (ఆర్ సిఓఓ) ఏఓఐ డాక్టర్ ప్రభాకర్ పి తమ బృందం సాధించిన విజయం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. లాపరోస్కోపిక్, రోబోటిక్, అండ్ హైపెక్ సర్జన్ (సర్జికల్ ఆంకాలజీ అండ్ థొరాసిక్ సర్జరీ) డాక్టర్ ప్రతాప్ వర్మ మాట్లాడుతూ… శ్రీ ఘీసారం వయస్సు ఎక్కువగా ఉండటం చేత, తాము ప్రమాదాలను చాలా జాగ్రత్తగా చూసుకున్నామన్నారు. అతను బాగా కోలుకోవడం, మంచి ఆరోగ్య స్థితికి తిరిగి రావడం చూసి తాము సంతోషిస్తున్నామన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement