Thursday, November 21, 2024

ఐషర్‌ నికరలాభం రూ.656 కోట్లు

సెప్టెంబర్‌ త్రైమాసికంలో ఐషర్‌ మోటార్స్‌ ఏకీకృత నికర లాభం 76 శాతం పెరిగి రూ. 656.86 కోట్లకు చేరుకుంది. గతేడాది ఇదే త్రైమాసికంలో ఇది రూ.373.20 కోట్లుగా ఉన్నది. ఐషర్‌ మోటార్స్‌ కార్యకలాపాల ద్వారా ఏకీకృత ఆదాయం 55.8 శాతం పెరిగి రూ.2,216.40 నుండి రూ3,453.43 కోట్లకు చేరుకుంది. వడ్డీ, పన్నులు, తరుగుదల, రుణ విమోచన ముందు ఆదాయాలు 75శాతం పెరిగి రూ.821 కోట్లకు చేరుకున్నాయి. వాణిజ్య వాహనాలకు ఉన్న బలమైన డిమాండ్‌ ఐషర్‌ సీవీ వ్యాపార పనితీరును పెంచింది. వీఈ కమర్షియల్‌ వెహికల్స్‌ (వీఈసీవీ) నుండి లాభం వాటా రూ.44 కోట్లుగా ఉంది. ఇది గతేడాది రూ.9.8కోట్లు మాత్రమే. రెండవ త్రైమాసికానికి మా పనితీరు చాలా ప్రోత్సాహకరంగా ఉంది. కొత్త హంటర్‌ 350 లాంచ్‌తో పుంజుకున్నాం అని ఐషర్‌ మోటార్స్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ సిద్ధార్థ లాల్‌ అన్నారు. ఈ త్రైమాసికంలో మేము హెవీ డ్యూటీ ట్రక్కులు, బస్సుల విభాగంలో మా మార్కెట్‌ వాటాను మరింత పటిష్టం చేసుకున్నాము, అదే సమయంలో కొత్త ఉత్పత్తుల స్లేట్‌ను ప్రారంభించి, మా పంపిణీ పరిధిని మెరుగుపరిచాము”అని ఆయన అన్నారు. రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ ఈ త్రైమాసికంలో 203,451 మోటార్‌సైకిళ్లను విక్రయించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement