2021-22 ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు 8.7 శాతంగా నమోదైంది. అదేవిధంగా మార్చి త్రైమాసికంలో జీడీపీ వృద్ధిరేటు 4.1 శాతంగా రికార్డయ్యింది. 2020-21 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే.. 2021-22 ఆర్థిక సంవత్సరంలో వృద్ధిరేటు పెరిగింది. 2020-21లో నమోదైన 6.6 శాతం ప్రతికూల వృద్ధి కంటే.. 2021-22లో ఆర్థిక వృద్ధి మెరుగుపడింది. అదేవిధంగా మార్చి త్రైమాసికంలో (2021-22 ఆర్థిక సంవత్సరం) 4.1 శాతం వృద్ధి రేటు మెరుగ్గా ఉంది. 2020-21 మార్చి త్రైమాసికంలో 1.6 శాతం వృద్ధి రేటు నమోదైంది.
2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి.. స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ మంత్రిత్వ శాఖ అంచనా ప్రకారం.. జీడీపీ వృద్ధిరేటు 8.9 శాతంగా ఉండాలి. అదేవిధంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వృద్ధిరేటు 9.5 శాతంగా అంచనా వేసింది. కానీ అనూహ్యంగా 8.7 శాతంగా రికార్డయ్యింది. అయితే మార్చి త్రైమాసికానికి సంబంధించిన ఆర్‌బీఐ వృద్ధిరేటు 6.1 శాతంగా అంచనా వేసింది. కానీ 4.1 శాతంగా నమోదైంది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..