స్మగ్లింగ్ గూడ్స్‌పై సమాచారం ఇస్తే ప్రభుత్వం భారీ స్థాయిలో బహుమతి ఇస్తోంది. టాక్స్ పరిధిలోకి వచ్చే ఏ వస్తువు అక్రమ రవాణా గురించి వివరాలు అందించినా.. దాని విలువలో 20 శాతం మొత్తాన్ని ప్రభుత్వం ఆ ఇన్‌ఫార్మర్‌కు ఇస్తుందని అధికారులు చెప్తున్నారు. అంటే ఎవరైనా కోటి రూపాయల విలువైన బంగారాన్నో, మరేదైనా వస్తువునో అక్రమంగా తీసుకొస్తున్నట్టు సమాచారం ఇస్తే.. రూ. 20 లక్షలు వారి సొంతమైనట్టే. పైగా ఇలా సంపాదించిన మొత్తంపై ఎలాంటి ఆదాయపు పన్ను కూడా ఉండదని ఐఆర్ఎస్ అధికారి కిరణ్ కుమార్ వెల్లడించారు.
దేశంలో బంగారం అక్రమ రవాణా కోసం స్మగ్లర్లు క్యాడ్‌బరీ అనే కోడ్‌ను ఉపయోగిస్తారని కిరణ్‌కుమార్ చెప్పారు. బంగారం బిస్కెట్లు సరిగ్గా క్యాడ్‌బరీ చాక్లెట్‌లాగా ఉండటంతో అలా చెప్పుకుంటారని అన్నారు. ఇన్‌ఫార్మర్లు విమానం టికెట్ నెంబర్, ప్రయాణికుడి పేరు చెప్తే.. చాలు వారిని తాము ట్రాక్ చేస్తామని వివరించారు. ఇక స్మగ్లర్లు విమానాశ్రయంలో ప్రవర్తించే తీరు వేరేలా ఉంటుందని.. వారు ఏదో దాస్తున్నారని సులువుగానే తెలుసుకోవచ్చని చెప్పుకొచ్చారు. ప్రభుత్వం 20 శాతం మొత్తాన్ని బహుమతిగా ఇస్తుండటంతో.. చాలా మంది ఇన్‌ఫార్మర్ పనిని కూడా ఓ ప్రొఫెషన్‌గా ఎన్నుకున్నవారని ఐఆర్ఎస్ అధికారి కిరణ్ కుమార్ తెలిపారు.
ఈ వార్త కూడా చదవండి: మీరాబాయికి బంపర్ ఆఫర్.. లైఫ్ టైమ్ పిజ్జా ఫ్రీ