గతంలో స్కూ టర్లను విక్రయించిన లోహియా మెషీన్స్ (ఎల్‌ఎంఎల్) త్వరలోనే విద్యుత్ స్కూటర్ల మార్కెట్‌లోకి ప్రవేశించనుంది. గతంలో ఈ కంపెనీ ఎల్ ఎంఎల్ వెస్పాను మార్కెట్‌లో ప్రవేశపెట్టింది. పోటీ పెరగడం, అమ్మకాలు తగ్గిపోవడంతో వీటి ఉత్పత్తిని నిలిపివేసింది. కాగా, హర్యానాలోని మనేసర్ వద్ద ఉన్న హర్లే డేవిడ్‌సన్ గతంలో ఉపయోగించిన ప్లాంట్‌లో విద్యుత్ స్కూటర్లను తయారు చేయాలని కంపెనీ నిర్ణయిచింది. ఇటలీకి చెందిన పియాజియో వెస్పాను మన దేశానికి 1999లో తీసుకు వచ్చింది. అయితే సెల్స్ తగ్గిపోవడంతో దీని అమ్మకాలను కంపెనీ 2018లో నిలిపివేసింది.
ఎస్‌జీ మొబిలిటీ సారథ్యంలో ఇప్పటికే ఎల్‌ఎంఎల్ ఎలక్ట్రిక్ కంపెనీని ఏర్పాటు చేసింది. ఇక ఈ నెల 29న విద్యుత్ ద్విచక్ర వాహనల మూడు కాన్సెప్ట్‌లను ఆవిష్కరించనుంది. 2013 తొలి త్రైమాసికంలో విద్యుత్ స్కూటర్‌ను మార్కెట్‌లోకి విడుదల చేసే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. విద్యుత్ వాహనాల ఉత్పత్తికి మొదట కంపెనీ 350 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. వచ్చే 5 సంవత్సరాల్లో 1000 కోట్ల రూపాయల పెట్టబడులు పెట్టాలని కంపెనీ భావిస్తోంది. దేశ వ్యాప్తంగా వెయ్యి ఎల్‌ఎంఎల్ డీలర్‌షిప్‌లను ఏర్పాటు చేయాలని కంపెనీ నిర్ణయించింది.