Sunday, November 24, 2024

HYD: ఏఐ-ఆధారిత రిమోట్ పేరెంట్ హెల్త్ మానిటరింగ్ సర్వీస్ డోజీ శ్రవణ్ ను ప్రారంభించిన డోజీ

హైద‌రాబాద్: భారతదేశపు హెల్త్ ఏఐలో అగ్రగామి, డోజీ ఇప్పుడు, క్లినికల్-గ్రేడ్ ఏఐ-శక్తితో కూడిన రిమోట్ పేరెంట్ మానిటరింగ్ (ఆర్ పిఎం) సర్వీస్‌, డోజీ శ్రవణ్ ను తీసుకువచ్చింది. విదేశాల్లో నివశిస్తున్నప్పుడు తమ తల్లిదండ్రుల ఆరోగ్యాన్ని పర్యవేక్షించడం భారతీయులకు అతి ముఖ్యమైన ఆందోళనగా ఉంటుంది. డోజీ శ్రవణ్ ఇప్పుడు విదేశాలలో ఉన్న కుటుంబాలు భారతదేశంలోని తమ తల్లిదండ్రుల ఆరోగ్యాన్ని క్రమం తప్పకుండా ట్రాక్ చేయడానికి వీలు కల్పిస్తుంది.

ఈసంద‌ర్భంగా డోజీ సీఈఓ అండ్ కో-ఫౌండర్ ముదిత్ దండ్వాటే మాట్లాడుతూ… భారతీయ సంస్కృతిలో తల్లిదండ్రుల సంరక్షణ ప్రాధాన్యతను శ్రవణ్ ప్రతిబింబిస్తుందన్నారు. మన తల్లిదండ్రుల పట్ల శ్రద్ధ మన సమాజంలో లోతుగా పాతుకుపోయిందన్నారు. భారతీయ ప్రవాసులు ప్రపంచవ్యాప్తంగా మనల్ని గర్వపడేలా చేస్తూనే ఉన్నారు, వారి తల్లిదండ్రుల ఆరోగ్యాన్ని దూరం నుండి నిర్వహించడం ఒక పెద్ద ఆందోళనగా మిగిలిపోయిందన్నారు. డోజీ శ్రవణ్‌తో, ఎన్ఆర్ఐ లు ఇప్పుడు భారతదేశంలోని తమ తల్లిదండ్రుల ఆరోగ్యంను నిరంతరం పర్యవేక్షిస్తున్నారని, వారికి మరింత నాణ్యమైన సమయాన్ని, మనశ్శాంతిని కల్పిస్తారని భరోసా ఇవ్వవచ్చన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement