అమెరికా మాజీ అధ్యక్షుడు, రియల్ ఎస్టేట్ మొఘల్ డోనాల్డ్ ట్రంప్ ఈసారి ఫోర్బ్స్ సంపన్నుల జాబితాలో చోటు సంపాదించలేకపోయారు. గత 25 ఏళ్లలో ఫోర్బ్స్ టాప్-400 జాబితాలో ఆయనకు స్థానం దక్కకపోవడం ఇదే మొదటిసారి. డోనాల్డ్ ట్రంప్ ఆస్తులు విలువ సుమారు 2.5 బిలియన్ల డాలర్లు ఉంటుంది. అయితే మహమ్మారి కరోనా వల్ల గత ఏడాది నుంచి ఆయన ఆస్తులు 600 మిలియన్ల డాలర్లు తగ్గింది. దీంతో ఫోర్బ్స్-400 జాబితాకు ట్రంప్ దూరమైనట్లు అర్థమవుతోంది. ట్రంప్ ఆ జాబితాలో స్థానం దక్కించుకునేందుకు కనీసం 400 మిలియన్ల డాలర్లు తక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. తన నిర్ణయాల వల్లే ట్రంప్ ర్యాంక్ దిగజారిపోయినట్లు ఫోర్బ్స్ మ్యాగ్జిన్ వెల్లడించింది.
ఇది కూడా చదవండి: తెలుగు అకాడమీ కేసు: మరో బ్యాంక్ మేనేజర్ అరెస్ట్