నిన్న ఎయిర్ ఇండియా డాటా లీకై కలవరానికి గురిచేయగా.. ఇవాళ పిజ్జాలు తయారీదారు డొమినోజ్లో కూడా డాటా లీక్ అయింది. దాదాపు 18 కోట్ల ఆర్డర్ డాటా లీకైనట్లుగా సదరు కంపెనీ తెలిపింది. అయితే, వినియోగదారుల ఆర్థిక సమాచారానికి ఎలాంటి ముప్పు వాటిల్లలేదని సంస్థ స్పష్టం చేసింది. తమ వినియోగదారుల డాటా లీక్ అయిన విషయం నిజమే అని డొమినోజ్ ఒప్పుకున్నది. అయితే, ఇది తమ వ్యాపారంపై ఎటువంటి ప్రభావం చూపలేదని తెలిపింది. సైట్ భద్రతకు సంబంధించిన సంఘటన జరిగిందని డామినోజ్ యజమాని జూబిలెంట్ ఫుడ్‌వర్క్స్ అంగీకరించింది. కానీ చందాదారుల ఆర్థిక సమాచారం లీక్ కాలేదని తెలిపింది. సంస్థ ఎటువంటి ఆర్థిక సమాచారం లేదా క్రెడిట్ కార్డ్ డాటాను నిల్వ చేయదని డొమినోజ్ పేర్కొన్నది. తమ నిపుణులు ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు కంపెనీ తెలిపింది.
Advertisement
తాజా వార్తలు
Advertisement