Saturday, November 23, 2024

Follow up : నష్టాల నుంచి లాభాల్లోకి దేశీయ స్టాక్‌ సూచీలు- వరుసగా ఐదవ రోజు లాభాలు

దేశీయ స్టాక్‌ మార్కెట్లు వరుసగా ఐదవ రోజూ లాభాల్లో చలించాయి. గురువారం ఉదయం లాభాల నుంచి నష్టాల్లోకి జారుకున్న సూచీలు ఆఖర్లో తిరిగి లాభాల్లోకి వచ్చాయి. కనిష్ట స్థాయిల్లో కొనుగోళ్ల మద్దతు లభించింది. నష్టాల్లో చలించిన సూచీలు, మధ్యాహ్నం సమయానికి ఫ్లాట్‌గా మారాయి. ఆఖరి గంట వరకు ఇదే స్తబ్దత కొనసాగింది. చివర్లో కొనుగోళ్ల మద్దతు లభించడం, రూపాయి కొంతమేరు పుంజుకోవడం సానుకూలంగా మారింది. బుధవారం ట్రేడింగ్‌లో రూ.83వద్ద జీవనకాల కనిష్టాన్ని తాకిన రూపాయి, మార్కెట్‌ ముగిసే సమయానికి కోలుకుని రూ.82.75వద్ద స్థిరపడింది. సెన్సెక్స్‌ 58,824 పాయింట్ల వద్ద లాభాలతో ప్రారంభమైంది. ఇంట్రాడేలో 59,278-58,791 మధ్య కదలాడింది.

చివరకు 95 పాయింట్లు ఎగబాకి 59,202 పాయింట్ల వద్ద స్థిరపడింది. నిఫ్టీ సైతం 51 పాయింట్లు లాభపడి 17,563 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌-30 సూచీలో 18షేర్లు లాభపడ్డాయి. హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, టెక్‌ మహింద్రా, ఎన్‌టీపీసీ, పవర్‌గ్రిడ్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, నెస్లే ఇండియా, ఐటీసీ, టీసీఎస్‌, ఇన్ఫీ, టాటాస్టీల్‌ షేర్లు లాభపడగా, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, ఏసియన్‌ పెయింట్స్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్స్‌, హెచ్‌ డీఎఫ్‌సీ బ్యాంకు,టైటాన్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, మారుతి, హెచ్‌డీఎఫ్‌సీ అత్యధికంగా నష్టపోయాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement