స్టాక్ మార్కెట్ల లాభాలకు ఈ రోజు (గురువారం) బ్రేక్ పడింది. వరసగా ఆరు సెషన్లు మార్కెట్లు లాభాల్లోనే ముగిశాయి. మధ్యాహ్నం వరకు లాభాల్లోనే ఉన్న మార్కెట్లు, అమ్మకాల ఒత్తిడితో ఇంట్రాడే కనిష్టాలను తాకాయి. తరువాత కొంత కోలుకున్నప్పటికీ చివరకు స్వల్ప నష్టాల్లో ముగిశాయి. ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు దిగడంతో సూచీలపై ఒత్తిడి పెరిగింది. మరోవైపు క్రమంగా కొలుకుంటూ వచ్చిన రూపాయి తిరిగి బలహీనపడటం కూడా మార్కెట్‌పై ప్రభావం చూపింది.
సెన్సెక్స్ 51.73 పాయింట్ల నష్టంతో 58298.80 వద్ద ముగిసింది. నిఫ్టీ 6.15 పాయింట్ల నష్టంతో 17382 వద్ద ముగిసింది.
బంగారం 10 గ్రాముల ధర 409 రూపాయిలు పెరిగి 52,103 వద్ద ట్రేడయ్యింది. వెండి కిలో 880 రూపాయిలు పెరిగి 58,434 వద్ద ట్రేడయ్యింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 78.55 రూపాయిలుగా ఉంది.
లాభపడిన షేర్లు..
సన్‌ఫార్మా, నెస్లే ఇండియా, ఇన్ఫోసిస్, డాక్టర్ రెడ్డీ ల్యాబ్స్, విప్రో, ఎం అండ్ ఎం, టాటా స్టీల్ , సిప్లా, అపోలో ఆసుప్పటల్స్, హిండాల్కో, జేఎస్‌డబ్ల్యూ స్టీల్ షేర్లు లాభపడ్డాయి.
నష్టపోయిన షేర్లు..
ఎన్‌టీపీసీ, టాటా కన్జ్యూమర్, కోల్ ఇండియా, ఎస్‌బీఐ, రిలయన్స్ ఇండస్ట్రీస్, శ్రీ సిమెంట్ , యాక్సిస్ బ్యాంక్, పవర్ గ్రిడ్ కార్పోరేషన్, కోటక్ మహీంద్రా బ్యాంక్ షేర్లు నష్టపోయాయి.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.