త్వరలో వేలం వేయనున్న 5జీ స్పెక్ట్రమ్‌ను నేరుగా టెక్నాలజీ సంస్థలకు కేటాయించవద్దని టెలికం సంస్థలు ప్రభుత్వాన్ని గట్టిగా కోరాయి. ఈ మేరకు 5 టెలికం కంపెనీలు డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్(డాట్) కు ఒక లేఖ రాశాయి. 5జీని నేరుగా సిస్టమ్ ఇంటిగ్రేటర్స్‌కు, ఇంటర్‌మిడియేటర్స్‌కు కేటాయించవద్దని కోరారు. లెటర్ కాపీని ప్రధాన మంత్రి కార్యాలయానికి, నీతి ఆయాెెగ్, ఆర్థిక వ్యవహారాల శాఖకు కూడా పంపించారు. క్యాప్టివ్ నెట్‌వర్క్ ఏర్పాటు చేసేందుకు ఎండ్ యూజర్స్ అయిన ఎంటర్‌ప్రైజేస్, కార్పోరేట్స్‌కు తప్ప థర్డ్ పార్టీ సంస్థలకు ఇవ్వొద్దని ఈ లేఖలో గట్టిగా కోరాయి.
ఇలాంటి సంస్థలకు 5జీ స్పెక్ట్రమ్ కేటాయిస్తే, దొడ్డిదారిన టెలికమ్ సేవల్లోకి ప్రవేశిస్తాయని సెల్యూలర్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా తన లేఖలో పేర్కొంది. వేలంలో స్పెెక్ట్రమ్‌ను కేటాయించేందుకు అనుసరించే విధి విధానాలు, నిబంధనలపై వివరణ ఇవ్వాల్సి అవసరం ఉందని లేఖలో కోరారు. ప్రయివేట్ క్యాప్టివ్ నెట్‌వర్క్‌లకు కేటాయించే స్పెక్ట్రమ్‌ను ఈ సంస్థలు దొడ్డిదారిలో 5జీమొబైల్ సేవలను అందించే అకాశం ఉందని టెలికం సంస్థలు భావిస్తున్నాయి. ఇదే జరిగితే తాము నష్టపోతామని ఈ కంపెనీలు భావిస్తున్నాయి. జులై 26న స్పెక్ట్రమ్ వేలం నిర్వహించనున్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.