టెక్ సంస్థల మాదిరిగానే ఉద్యోగులపై డిస్నీ సంస్థ కొరడా ఝులిపించింది. ఆర్థిక సమస్యలను కారణంగా చూపుతూ ఒకేసారి వేలాది మందిని తొలగించాలని నిర్ణయించింది. గురువారం నాటి ప్రకటన ప్రకారం, ఆర్థిక సంక్షోభం వల్ల లేఆఫ్ ప్రకటిస్తున్నట్లు పేర్కొంది. స్ట్రీమింగ్ సబ్‌స్క్రైబర్‌లు తగ్గడంతో 7,000 మంది ఉద్యోగులను తొలగించింది. కరోనా మహమ్మారి వల్ల పలు టెక్ కంపెనీలు వేలాదిమంది ఉద్యోగులను తొలగించాయి.
ప్రపంచవ్యాప్తంగా డిస్నీకి 1,90,000 మంది ఉద్యోగులున్నారు. వాల్ట్ డిస్నీ స్థాపించిన స్టోరీడ్ కంపెనీ తన స్ట్రీమింగ్ సర్వీస్ చందాదారుల సంఖ్య మొదటిసారి పడిపోయింది.20వ సెంచరీ ఫాక్స్ చలనచిత్ర స్టూడియోను కొనుగోలు చేయడానికి డిస్నీ అధిక చెల్లింపులు చేసింది.