Saturday, January 18, 2025

ఈ నెల‌ 26న కోల్డ్‌ప్లే ప్రత్యక్ష ప్రదర్శనను ప్రసారం చేయనున్న డిస్నీప్ల‌స్ హాట్‌స్టార్

హైద‌రాబాద్, (ఆంధ్ర‌ప్ర‌భ ) : కోల్డ్‌ప్లేతో కలిసి వారి ఐకానిక్ మ్యూజిక్ ఆఫ్ ది స్పియర్స్ వరల్డ్ టూర్ కచేరీని భారతదేశం అంతటా ప్రేక్షకులకు ప్రత్యక్షంగా ప్రదర్శించడం ద్వారా లైవ్ స్ట్రీమింగ్ వినోద అనుభవాల్లో కొత్త ప్రమాణాలను డిస్నీప్ల‌స్ హాట్‌స్టార్ నెలకొల్పడానికి సిద్ధమైంది. ఈనెల 26న అహ్మ‌దాబాద్ లో ప్ర‌త్య‌క్ష ప్ర‌ద‌ర్శ‌న‌ను ప్ర‌సారం చేయనుంది.

ఈ సందర్భంగా జియోస్టార్ – స్పోర్ట్స్ సీఈఓ సంజోగ్ గుప్తా మాట్లాడుతూ… డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌ వద్ద తాము అసమానమైన, లీనమయ్యే అనుభవాలతో వీక్షకులను ఆకర్షించడం ద్వారా, తమ భాగస్వాములు, ప్రకటనదారులు, ప్రేక్షకులకు స్థిరంగా విలువను అందించడం ద్వారా భారతదేశ వినోదం, క్రీడా వినియోగాన్ని విప్లవాత్మకంగా మార్చామన్నారు. కోల్డ్‌ప్లేతో తమ భాగస్వామ్యం దేశవ్యాప్తంగా ప్రేక్షకులకు ఐకానిక్ సాంస్కృతిక అనుభవాలను తీసుకురావాలనే తమ నిబద్ధతను ప్రతిబింబిస్తుందన్నారు.

- Advertisement -

బ్యాండ్ ప్రధాన గాయకుడు క్రిస్ మార్టిన్ మాట్లాడుతూ… భారతదేశంలోని తమ స్నేహితులందరికీ నమస్తే అని, ఈనెల 26న అహ్మదాబాద్ నుండి తమ ప్రదర్శన డిస్నీప్లస్ హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం అవుతుందని తాము సంతోషిస్తున్నామన్నారు. కాబట్టి మీరు భారతదేశంలో ఎక్కడి నుండైనా దీన్ని చూడవచ్చన్నారు. మీరు మాతో చేరతారని తాము ఆశిస్తున్నామన్నారు. మీ అందమైన దేశాన్ని సందర్శించడానికి తాము చాలా ఉత్సాహంగా ఉన్నామన్నారు. అపూర్వమైన ప్రేమను కోరుకుంటున్నామన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement