ఏప్రిల్ నెల మధ్యలో ఎల్‌ఐసీ ఐపీవో వచ్చే అవకాశం ఉన్నట్లు ప్రభుత్వ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. స్టాక్‌మార్కెట్‌ను నిశితంగా పరిశీలిస్తున్నామని, ఫిబ్రవరిలో ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్యలు మొదలైనప్పటి నుంచి మార్కెట్‌లో ఒడుదొడుకులు కనిపిస్తున్నాయని చెప్పారు. ఉద్రిక్త పరిస్థితులు సర్దుకొన్నాక మార్కెట్‌లు పూర్వస్థితికి చేరే అవకాశం ఉందని సీనియర్ అధికారి వెల్లడించారు. ఎల్‌ఐసీ ఉద్యోగులకు, పాలసీదారులకు ఐపీవో ప్లnోర్ ప్రైస్‌పై ప్రత్యేక రాయితీ లభిస్తుంది. ఎల్‌ఐసీలో ప్రభుత్వానికి నూరు శాతం వాటా ఉంది. ఇందులో 5 శాతం వాటాకు సమానమైన 31.6 కోట్లకు పైగా రూ.10 ముఖ విలువ కలిగిన ఈక్విటీ షేర్లను ప్రభుత్వం ఐపీవో ద్వారా విక్రయించనుంది. ఎల్‌ఐసీ ఐపీవో ఇష్యూలో 10 శాతం పాలసీ హూల్డర్స్‌కు, 5 శాతాన్ని సంస్థ ఉద్యోగులకు కేటాయిస్తారు. వీరికి షేరు ధరలో రాయితీ అందిస్తారు.
దేశీయ స్టాక్ మార్కెట్ చరిత్రలో ఎల్‌ఐసీనే అతిపెద్ద ఐపీవోగా నిలవనుంది. 2021లో రూ.18,300 కోట్లతో పేటీఎం ఐపీవోకు వచ్చింది. ఇప్పటి వరకు ఇదే గరిష్ఠం. అంతకు ముందు కోల్ ఇండియా రూ.15,500 కోట్లు, రిలయన్స్ పవర్ రూ.11,700 కోట్ల చొప్పున ఐపీవో ద్వారా నిధులు సమీకరించాయి. ఎల్‌ఐసీ ఎంబడెడ్ విలువను రూ.5.4 లక్షల కోట్లుగా అంతర్జాతీయ సంస్థ మిల్లిdమన్ అడ్వైజర్స్ నిర్ధారించింది. ఎల్‌ఐసీ ఐపీవో ద్వారా రూ.63 వేల కోట్లు ప్రభుత్వ ఖజానాకు చేరుతాయని అంచనా. ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్‌కు ఎల్‌ఐసీ ఐపీవోలో 20 శాతం అనుమతి కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు డిపార్ట్‌మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ ప్రకటించింది.