కేంద్ర ప్రభుత్వానికి పరోక్ష పన్నుల రూపంలో ఆదాయం పెరిగింది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో వసూలైన నికర పరోక్ష పన్నులు రూ.10.71 లక్షల కోట్లు. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో వసూలైనదాని కన్నా 12 శాతం ఎక్కువ. కేంద్ర నికర ప్రత్యక్ష పన్నుల వసూళ్ళు 2020-21 ఆర్థిక సంవత్సరంలో సవరించిన అంచనా కన్నా 4.42 శాతం పెరిగి, రూ.9.45 లక్షల కోట్లు వసూలైంది. దీనిలో ప్రధానంగా కార్పొరేట్ పన్నులు, వ్యక్తిగత ఆదాయ పన్ను ఉన్నాయి. 2020-21 ఆర్థిక సంవత్సరంలో జీఎస్‌టీ, సెంట్రల్ జీఎస్‌టీ, ఇంటిగ్రేటెడ్ జీఎస్‌టీ, కంపెన్సేషన్ సెస్ వసూళ్ళు రూ.5.48 లక్షల కోట్లు. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో రూ.5.99 లక్షల కోట్లు వసూలైంది. అంటే అంతకుముందు సంవత్సరం కన్నా 2020-21 ఆర్థిక సంవత్సరంలో ఈ పన్నుల వసూళ్ళు 8.5 శాతం తగ్గాయి.
12 శాతం పెరిగిన నికర పన్నుల వసూళ్ళు
Previous article
Next article
మరిన్ని వార్తలు
Advertisement
తాజా వార్తలు
Advertisement