Wednesday, September 18, 2024

DGCA | విధుల్లో శిక్ష‌ణ లేని సిబ్బంది.. ఎయిర్ ఇండియాకు భారీ జరిమానా!

దేశీయ విమానయాన దిగ్గజం ఎయిర్ ఇండియాకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) షాక్ ఇచ్చింది. నిబంధనలు ఉల్లంఘించినందుకు భారీ జరిమానాలు విధించింది. అర్హత లేని సిబ్బందితో ఎయిర్ ఇండియా విమానాలు నడుపుతున్నట్లు గుర్తించిన డీజీసీఏ… ఎయిర్ ఇండియాకు రూ.90 లక్షల భారీ జరిమానా విధించింది. దీంతోపాటు ఎయిర్ ఇండియా డైరెక్టర్ ఆపరేషన్స్‌కు రూ.6 లక్షలు, డైరెక్టర్ శిక్షణకు రూ.36 లక్షల చొప్పున మొత్తం రూ.98 లక్షల జరిమానా వేసింది.

గతంలోనూ ఎయిరిండియాకు ఇటువంటి జరిమానా విధించిన సందర్భాలు ఉన్నాయి. ఈ ఏడాది మార్చిలో నిబంధనలను అతిక్రమించినందుకు రూ.80 లక్షలు ఫైన్ వేసింది. పైలెట్ల‌కు విశ్రాంతి కల్పించకుండా నిరంతరం డ్యూటీలు వేస్తూ ఫ్లైట్ డ్యూటీ టైం లిమిటేషన్, మేనేజ్‌మెంట్ సిస్టమ్ రెగ్యులేషన్స్ అతిక్రమించినందుకు ఈ జరిమానా వేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement