Tuesday, November 26, 2024

Devotional – అపురూప గ్రంథాలకు ఎత్తిన జయపతాక ‘పురాణపండ’

హైదరాబాద్‌ : ప్రముఖ రచయిత, ఆంధ్రప్రదేశ్‌ దేవాదాయ శాఖ ఆధికారిక మాసపత్రిక ఆరాధన పూర్వ సంపాదకులు పురాణపండ శ్రీనివాస్‌ ఇటీ-వల పూనుకున్న మహా పవిత్రోద్యమమైన శ్రీలలిత విష్ణు సహస్రనామ స్తోత్ర అపురూప గ్రంథ వైభవాలు తెలుగు రాష్ట్రాల అర్చక వేదపండితులకు ఉచితంగా అందడంతో అనేక ఆలయాల ధర్మకర్తలు సైతం శ్రీనివాస్‌ రచనా వ్యాఖ్యానాలు, యజ్ఞభావనకు జేజేలు పలుకుతున్నారు.

ప్రముఖ సంస్కృత వేద పండితులు, శ్రీవిద్యోపాసకులు, అనేక చండీయాగాల్లో తరిస్తున్న శీఆదిత్యరాంపాశర్మ వివిధ వైదికకార్యాల్లో అర్చక ప్రముఖులకు శ్రీలలిత విష్ణు సహస్రనామ స్తోత్ర గ్రంథాలను సమర్పణాభావంతో పంచడాన్ని ఆయన గురువు, కర్మయోగి అంపోలు రుద్రకోటేశ్వరశర్మ అభినందించడం విశేషం.

- Advertisement -

తెలుగు రాష్ట్రాల్లో వేలమంది అభిమానులున్న రాంపా ఆదిత్యశర్మ ఉపాసనకు అమ్మవారే పలుకుతుందని వందల మంది ఇప్పటికే ప్రత్యక్షంగా చెప్పడం ఆశ్చర్యకరంగా మహామహా పండితోత్తములు బాహాటంగా చెబుతున్నారు. దేశదేశాల తెలుగు వారికి తెలుగు దైవీయ గ్రంథాల రచనలో, ప్రచురణలో ఆరితేరడమే కాకుండా దేశదేశాల తెలుగు వారూ తరతరాలూ చెప్పుకునేలా ఒక యజ్ఞభావంతో మహాగ్రంథ వితరణ సాగుతున్న పురాణపండ శ్రీనివాస్‌ అద్భుత గ్రంథాలు ఇప్పుడు తెలుగు నాట హాట్‌ టాపిక్‌ అయ్యాయని ప్రముఖ నటు-లు, ఆట కదరా శివా ఫేమ్‌ తనికెళ్ళ భరణి ఇటీ-వల రవీంద్రభారతి సభలో చెప్పడం పురాణపండ అసాధారణ కృషికి ఎత్తిన జయపతాకంగా చెప్పక తప్పదు.

ఇప్పటికే శ్రీనివాస్‌ కొన్ని అమోఘ గ్రంథాలను వివిధ దేవస్థానాలు ఉచితంగా అందించడాన్ని సోషల్‌ మీడియా కోడై కూస్తోంది. ఆదిత్య రాంపా, యామిని దంపతులు సోషల్‌ మీడియాలో పేస్‌ బుక్‌ ద్వారా చేసే ఆర్షవిద్యల పద్య, శ్లోక రాగయుక్త భక్తి వీడియోలకు లక్షల్లో శ్రోతలున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement