- స్థూల ఉత్పత్తుల విలువ 60% వృద్ధి
- 15,852 యూనిట్లకు అనుమతులు
- ఏడేళ్లలో రూ.2.14లక్షల కోట్ల
- పెట్టుబడులు శ్రీ ఐటీ ఎగుమతులు
- రూ.1.45 లక్షల కోట్లకు చేరిక
- 15.లక్షల మందికి ఉపాధి ఊతం
- విజయ తీరాలకు ఏడేళ్ల ప్రస్థానం
హైదరాబాద్, ఆంధ్రప్రభ: టీఎస్‌ఐపాస్‌తో తెలంగాణ రాష్ట్రం లో పారిశ్రామిక రంగం ప్రగతి బాటలో వెలుగొందుతోందని ప్రణాళికా శాఖ విడుదల చేసిన ప్రగతి నివేదిక వెల్లడించింది. 2014-15తో పోల్చితే ఏడేళ్లలో తయారీ రంగం విలువ రెట్టింపు కాగా, పారిశ్రామిక రంగంలో ఉత్పత్తుల స్థూల విలువ 60శాతం వృద్ధి చెందినట్లు నివేదికలో పేర్కొంది. నిర్ణీత గడువులోగా అనుమతులు మంజూరు చేయకుంటే ఆటోమేటిక్‌గా డీవ్డ్‌ు టూ అప్రూవ్ వ్యవస్థ దేశంలో ఒక్క తెలంగాణలోనే అమలులో ఉంది. 2020-21 నాటికి టీఎస్‌ఐపాస్ ద్వారా 15,852యూనిట్లు అనుమతులు పొందాయి. ఇందులో పెట్టుబడులు రూ.2.14 లక్షల కోట్లు కాగా, ఉద్యోగాల కల్పన 15.6లక్షలుగా ఉంది. అదేవిధంగా 2014-15తో పోలిస్తే ఏడేళ్లలో సేవా రంగం విలువ రెండింతలైంది. ప్రధానంగా ఐటీ రంగంలో అనూహ్య వృద్ధి సాధ్యమైంది. 2014-15లో రూ.66,276 కోట్లుగా ఉన్న ఐటీ ఎగుమతులు 2020-21 నాటికి ఏకంగా రూ.1.45 లక్షల కోట్లకు చేరాయి. తెలంగాణ రాష్ట్రం అద్భుతమైన పారిశ్రామిక ప్రగతితో అంతర్జాతీయ దృష్టిని ఆకర్షిస్తోంది. తెలంగాణ తొలి ప్రభుత్వంలో దాదాపు రూ.2.14 లక్షల కోట్ల పారిశ్రామిక పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా దేశంలోనే అగ్రగామిగా వెలుగొందింది. ఈ పెట్టుబడుల వాటా రూ.5.9 లక్షల కోట్లకు పెంచుకోవడంతో రెండో విడత పాలనను మొదలుపెట్టింది. నూతన పారిశ్రామిక విధానంతో దేశ పారిశ్రామికాభివృద్ధిలో 79శాతం వృద్ధిరేటును తెలంగాణ సాధించి తన విజయ బావుటాను ప్రపంచానికి చాటిచెప్పింది. అనేక అంతర్జాతీయ పరిశ్రమల ఏర్పాటుతో 15.6 లక్షల మందికి ఉపాధి అవకాశాలను విస్తృతం చేసేలా తెలంగాణ సర్కార్ చేసిన కృషి ఇప్పుడిప్పుడే ఫలాలిచ్చేలా అత్యంత వేగంగా కార్యాచరణ సాగుతోంది. ఐకియా, కోకాకోలా, ప్రోక్టర్ అండ్ గ్యాంబుల్, జాన్సన్ అండ్ జాన్సన్, చైనాకు చెందిన డాంగ్ పాంగ్ ఎలక్ట్రికల్ కార్పొరేషన్, ఇన్సుమన్ ప్రాజెక్టువంటివి లక్షలాది కోట్ల పెట్టుబడులతో తెలంగాణలో తమ పరిశ్రమల స్థాపనకు ముందుకొచ్చాయి. వీటికి తెలంగాణ ప్రభుత్వం సులువుగా టీఎస్‌ఐపాస్ ద్వారా అనుమతులు, భూముల కేటాయింపు, నిరంతర విద్యుత్ అందజేత, ఇన్‌సెంటివ్‌లు వంటి వాటితో ప్రోత్సాహం కల్పించింది. తెలంగాణ రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతి పరుగులు పెడు తోంది. రోజుకో రికార్డును సొంతం చేసు కుంటున్న రాష్ట్రం మరో రికార్డుకు చేరువవు తోంది. పెట్టుబ డుల సాధ న, పరిశ్ర మల వ్యవ స్థాప న, ఉపాధి కల్ప నలో జెట్ వేగం తో దూసు కు పోతోంది. దేశంలో ఏ రాష్ట్రం లో లేని ఏక గవాక్ష అను మతు లతో సరి కొత్త రికార్డులను సొం తం చేసుకుంది.
కొత్త జిల్లాలతో అభివృద్ధిని వికేంద్రీకరణ చేయవచ్చన్న ప్రభుత్వ అంచనాలు నిజమవుతున్నా యి. నూతన పారిశ్రామిక విధానం ద్వారా అత్యధికంగా మారుమూల జిల్లాల్లోనే పరిశ్ర మలకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు జారీ చేసింది.
పెద్దపల్లి, వరంగల్ లాంటి జిల్లాలు ఈ రంగంలో శరవేగంగా దూసుకు పోతు న్నాయి. పారిశ్రా మిక కారిడార్‌గా, వాణిజ్య కేంద్రా లుగా పలు జిల్లాలు గణనీ యంగా అభివృద్ధిని సాధిస్తున్నాయి.
పారి శ్రామిక వికేంద్రీ కరణ ఫలాలు జిల్లా ల పునర్‌వ్యవ స్థీకర ణ తర్వాత ప్రత్య క్షంగా కనిపిస్తున్నా యని తాజా గణాం కాలు స్పష్టం చేసు ్తన్నా యి. ఇక పెట్టుబ డుల సాధనలో రంగా రెడ్డి జిల్లా కూడా అద్భుత ప్రగతిని సాధించింది. మొద టి నుంచీ పారిశ్రామిక రంగంలో తనకున్న హవాను ఈ జిల్లా కాపాడుకుంది.
దేశీయ, విదేశీ పారిశ్రామిక వర్గా ల్లో అపారమైన నమ్మకాన్ని తెలంగా ణ ప్రభుత్వం కల్పించడంతోనే ఈ ప్రగతి సాకారమైంది. అద్భుతమైన శాంతిభద్రతలు, 24గంటల నిరంతర విద్యుత్, ఇండస్ట్రీయల్ ఫ్రెడ్లీ విధానాలు, అవినీతి రహిత అను మతుల వంటిది పారి శ్రామిక వర్గా ల్లో విశ్వాసం పెంచాయి. అంత ర్జాతీయ పరిశ్రమల పెట్టుబ డులకు ప్రభుత్వం ఈ ఏడళ్లలో ఇచ్చిన పూర్తి భరోసా మరిన్ని పెట్టుబడు లకు అనుకూ లంగా మారింది.
పూర్తి సరళం..
గతంలో ఎక్కడైనా ఒక పరిశ్రమ ఏర్పాటు చేయాలంటే దాదాపు 33 శాఖలనుంచి అనుమతులు తీసుకోవాల్సి వచ్చేది. ఇది అనేక వ్యయ ప్రయాసలు, భారీగా ముడుపులతో కూడుకుని తీవ్ర కాల యా పనకు కారణంగా భావించి అనేకమంది పెట్టుబడిదారులు ఇతర రాష్ట్రాలకు తరలివెళ్లేవారు. తీవ్ర జాప్యం, అవినీతి పారిశ్రామిక రంగానికి ఆటం కంగా ఉన్నాయ నే ఆరోపణలు ఉండేవి. వీటన్నిం టినీ గమనించిన సీఎం కేసీఆ ర్, మంత్రి కేటీఆర్‌లు ముందు చూపు తోతెలంగాణ ఆవిర్భవించిన అనతికా లంలోనే పారదర్శకతకు చిహ్నంగా టీఎస్ ఐపాస్‌ను సర్కార్ అమలులోకి తెచ్చేందు కు కృషి చేశారు. పారిశ్రామిక వర్గాల స్వీయ ధ్రువీకరణతో అన్ని శాఖల అనుమతులను ఏక గవాక్ష విధానంలో ఒకే దగ్గర అందిం చ వెసులుబాటు తెలంగాణ ప్రభుత్వం కల్పించింది. మరోవైపు గతంలో ఉన్న పారిశ్రామిక పవర్ హాలిడేలకు తెలంగాణ ప్రభుత్వం తిలోదకాలిచ్చింది. ఇది పారిశ్రామిక వర్గాలకు ఎంతో ఊరట ఇవ్వడంతోపాటు ఉత్పాదకత, లాభాల పెంపునకు మార్గంగా నిల్చింది