హైదరాబాద్: రెకిట్స్ ఫ్లాగ్ షిప్ కాంపైన్, డెట్టాల్ బనేగా స్వాస్త్ ఇండియా (బిఎస్ఐ) అంతర్జాతీయ హ్యాండ్ వాషింగ్ దినోత్సవం 2024ను సంబరంలో భాగంగా, ఆరోగ్యవంతమైన భవిష్యత్తు కోసం చేతులు కడుక్కోవడం ప్రాధాన్యత పై భారతదేశం వ్యాప్తంగా 30 మిలియన్ పిల్లలకు అవగాహన కల్పిస్తోంది. క్లీన్ హ్యాండ్స్ ఫర్ ఆల్ : అడ్వాన్సింగ్ హెల్త్ ఈక్విటీ త్రూ హైజీన్ ఇతివృత్తంగా ఈ కార్యక్రమం అన్ని స్థాయిలకు చెందిన పిల్లలకు ప్రధానమైన పరిశుభ్రత గురించి అవగాహన ఉండాలని, ఎవరూ ఈ విషయంలో వెనకబడకూడదని నిర్థారించడంలో డెట్టాల్ బిఎస్ఐ నిబద్ధతను తెలియచేస్తోంది.
ఈ సందర్భంగా రెకిట్ దక్షిణాసియా ఎక్స్ టర్నల్ అఫైర్స్ అండ్ పార్ట్ నర్ షిప్స్ డైరెక్టర్ రవి భట్నాగర్ మాట్లాడుతూ… పరిశుభ్రతా అవగాహన కోసం, ప్రతి చిన్నారి కోసం ఆరోగ్యకరమైన భవిష్యత్తును సృష్టించడానికి రెకిట్ లో తాము అడ్డంకులను తొలగించడానికి కట్టుబడ్డామన్నారు. పరిశుభ్రతా సమానత్వానికి తమ దీర్ఘకాల నిబద్ధత అనేది భారత ప్రభుత్వం వారి క్లీన్ ఇండియా ఉద్యమంతో ఒక దశాబ్దానికి పైగా అనుసంధానమైందన్నారు.
ప్లాన్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మొహమ్మద్ అసిఫ్ మాట్లాడుతూ…. సబ్బుతో చేతులు శుభ్రం చేసుకోవడం అనేది ప్రాథమికమైన హక్కు, పిల్లలు అందరికీ, ప్రజలకు అవసరమన్నారు. ప్లాన్ ఇండియాలో తాము ప్రతి చిన్నారి, ప్రతి కుటుంబం, ప్రతి కమ్యూనిటీకి పరిశుభ్రతా సదుపాయాలు చైతన్యం అందుబాటులో ఉండటాన్ని నిర్థారించే దిశగా పని చేయడం కొనసాగిస్తామన్నారు. అందువలన ఒక్కరు కూడా ఈ సదుపాయం పొందకుండా మిగిలిపోరన్నారు. ప్రతి వ్యక్తి వర్థిల్లే ఆరోగ్యకరమైన, పరిశుభ్రతా-చైతన్యం కలిగిన దేశాన్ని సృష్టించడానికి మనం చేతులు కలుపుదామన్నారు.