Thursday, September 19, 2024

HYD: డిజైన్ డెమోక్రసీ 2024 – డిజైన్, ఆర్ట్ అండ్ ఇన్నోవేషన్ భవిష్యత్తును రూపొందించడం

హైదరాబాద్ : హైదరాబాద్‌లో అతిపెద్ద, అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న డిజైన్ ఫెస్టివల్, డిజైన్ డెమోక్రసీ 2024, అక్టోబర్ 4 నుండి 6, 2024 వరకు, హైటెక్స్ , హాల్స్ 1 అండ్ 3లో జరుగనుంది. ఈ అసాధారణ కార్యక్రమం క్రియేటర్లు, నిపుణులు అండ్ ఔత్సాహికులను ఒకే విధంగా ఆకర్షించటంతో పాటుగా డిజైన్, కళ, ఆవిష్కరణల కలయికకు హామీ ఇస్తుంది. పల్లికా శ్రీవాస్తవ్, శైలజా పట్వారీ అండ్ అర్జున్ రాఠీ నేతృత్వంలో జరుగనున్న ఈ ఫెస్టివల్ నగరం డిజైన్ ల్యాండ్‌స్కేప్‌ను మార్చే ఒక మైలురాయి కార్యక్రమంగా భావించబడుతుంది.

ఈసంద‌ర్భంగా డిజైన్ డెమోక్రసీ వ్యవస్థాపకులు పల్లికా శ్రీవాస్తవ్ మాట్లాడుతూ… ఈ సంవత్సరం తాము డిజైన్ ఫెస్టివల్స్ సాధించగల సరిహద్దులను పునర్నిర్వచించామన్నారు. త‌మ‌ లక్ష్యం మార్పును ప్రేరేపించడానికి, సహకారాన్ని ప్రోత్సహించడానికి ఆవిష్కరణ, కళ, రూపకల్పన కలిసిపోయే వేదికను సృష్టించడమ‌న్నారు. సృజనాత్మకత పరంగా వైవిధ్యాన్ని వేడుక చేసుకోవడం, భవిష్యత్ ట్రెండ్‌లకు వేదికను ఏర్పాటు చేయడం గురించి డిజైన్ డెమోక్రసీ 2024 నిర్వహించబడుతుందన్నారు.

- Advertisement -

డిజైన్ డెమోక్రసీ సహ-వ్యవస్థాపకురాలు శైలజా పట్వారీ మాట్లాడుతూ… హైదరాబాద్‌కు హస్తకళ, ఆవిష్కరణల గొప్ప చరిత్ర ఉందన్నారు. ఆధునిక డిజైన్ సరిహద్దులను అధిగమిస్తూ ఈ వారసత్వాన్ని ప్రతిబింబించే ప్రాంగణాన్ని సృష్టించడం త‌మ‌కు గర్వకారణంగా ఉందన్నారు. ఈవెంట్ క్యూరేటర్, అర్జున్ రాఠి, ప్రదర్శనలో ఉన్న ప్రత్యేకమైన కళాత్మక వ్యక్తీకరణల పట్ల తన సంతోషం వ్యక్తం చేశారు. డిజైన్ డెమోక్రసీ 2024 అనేది అన్ని రూపాల్లో సృజనాత్మకత వేడుక అన్నారు. లైటింగ్ , ఫర్నిచర్ నుండి ఆర్కిటెక్చరల్ ఫోటోగ్రఫీ అండ్ స్థానిక ప్రతిభ వరకు, ఈ ఫెస్టివల్ డిజైన్‌లో ఉత్తమమైన వాటిని అందిస్తుందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement