భారతదేశంలో లిథియం–అయాన్ బ్యాటరీ డిమాండ్ 2027 నాటికి 54 జీడబ్ల్యుహెచ్ (గిగావాట్ గంటలకు), 2030 నాటికి 127 గిగావాట్ గంటలకు పెరగనుంది. రాబోయే ఆరేళ్లలో దేశీయ ప్రాథమికశక్తి అవసరాలలో పునరుత్పాదక శక్తి వాటాను 50శాతానికి తీసుకెళ్లాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
ప్రస్తుతం, దేశీయ లిథియం-అయాన్ బ్యాటరీ నిల్వ డిమాండ్ 15జీడబ్ల్యుహెచ్‌గా ఉంది. ఇందుకోసం దిగుమతులపై ఆధారపడుతున్నాం. ఏది ఏమైనప్పటికీ, బ్యాటరీ నిల్వ సామర్థ్యాల డిమాండ్‌లో గణనీయమైన వృద్ధినేపథ్యంలో 2027 నాటికి దిగుమతులపై ఆధారపడటాన్ని 20 శాతానికి తగ్గించే అవకాశం ఉందని రేటింగ్ సంస్థ కేర్‌ఎడ్జ్ అంచనా వేసింది.
ప్రతిష్టాత్మక ప్రభుత్వ లక్ష్యాలు, కేంద్ర- రాష్ట్ర ప్రభుత్వాల విధానాలు/ప్రోత్సాహకాల మద్దతును నివేదిక ప్రముఖంగా ప్రస్తావించింది. ఎలక్ట్రిక్ వాహనాలను వేగంగా స్వీకరించడం, తయారీ ప్రోత్సాహక (ఫేమ్) పథకం, బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ (వీజీఎఫ్) కోసం వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ (బీఈఎస్‌ఎస్) పథకం వంటి అనేక చర్యలపై ప్రభుత్వం చొరవ తీసుకుంది.