Thursday, November 21, 2024

RAAM MG సహకారంతో 100 యూనిట్ల ఎంజి విండ్సర్ ఈవీ డెలివరీ !

జేఎస్ డబ్ల్యూ ఎంజి మోటార్ ఇండియా తమ వేగాన్ని కొనసాగిస్తూ, భారతదేశపు మొదటి ఇంటిలిజెంట్ సియువి, ఎంజి విండ్సర్ 100 యూనిట్ల మెగా డెలివరీ హైదరాబాద్ లో చేయనున్నట్లు ప్రకటించింది. విశేషంగా విక్రయించబడే ఈవీని RAAM MG డెలివరీ చేసింది, దేశవ్యాప్తంగా ఈ ఎలక్ట్రిక్ సియువి కోసం పెరుగుతున్న ఉత్సుకతను ప్రతిబింబించింది.

ఈ సందర్భంగా ర్యామ్ ఎంజి డీలర్ ప్రిన్సిపాల్ అమిత్ నల్లారెడ్డి మాట్లాడుతూ.. “MG విండ్సర్ ప్రారంభమైనప్పటి నుండి అందుతున్న స్పందనతో RAAM MGలోని మొత్తం బృందం ఆనందంగా ఉంది. MG విండ్సర్ దాని విలక్షణమైన ఉత్పత్తి ప్రతిపాదన, ఆకర్షణీయమైన యాజమాన్య ప్యాకేజీలతో ఈవీ మార్కెట్లో సంచలనంగా నిరూపిస్తోంది.

ఒక్క రోజులో 100 ఈవీలను డెలివరీ చేయడం అనేది చాలా స్వల్ప సమయంలోనే విండ్సర్ జనాదరణ గురించి ఎంతగానో తెలియచేస్తోంది. ఇంకా, 100% రోడ్ పన్ను మినహాయింపుతో ఈవీ కొనుగోళ్లను పెంచడానికి రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలి విధానం ఈవీలను వేగంగా స్వీకరించడానికి నిజమైన ప్రగతిశీల చర్య.’’ అని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement