Friday, November 22, 2024

ఈ యాప్‌లను తొలగించుకోండి.. గూగుల్‌ కీలక సూచన

అండ్రాయిడ్‌ ఫోన్లు ఉపయోగిస్తున్న యూజర్లకు గూగుల్‌ కీలక సూచన చేసింది. ఫోన్‌, బ్యాటరీ, డేటాను త్వరగా ఖాళీ చేస్తున్న 16 యాప్‌లను ప్లేస్టోర్‌ నుంచి తొలగించినట్లు ప్రకటించింది. యూజర్లు కూడా వెంటనే ఈ యాప్‌లను తమ ఫోన్ల నుంచి తొలగించుకోవాలని సూచించింది. ఫ్లాష్‌లైట్‌, కెమెరా, క్యూఆర్‌ రీడింగ్‌, యూనిట్‌ కన్వర్టర్స్‌, టాస్క్‌ మేనేజర్‌ వంటి యుటిలిటీ యాప్‌లు ఈ జాబితాలో ఉన్నాయి. ఇవి యూజర్ల ప్రమేయం లేకుండానే బ్యాక్‌గ్రౌండ్‌లో వెబ్‌ పేజీలు ఓపెన్‌ చేసిన ప్రకటనలప క్లిక్‌ చేస్తున్నట్లు గుర్తించామని మెకాఫే సైబర్‌ సెక్యూరిటీ సంస్థ తెలిపింది.

యూజర్లు తమ అవసరాల కోసం ఈ యూప్‌లను ఇన్‌స్టాల్‌ చేసుకున్న తరువాత హెచ్‌టీటీపీ రిక్వెస్ట్‌ సాయంతో ఒక రిమోట్‌ కాన్ఫిగరేషన్‌ను డౌన్‌లోడ్‌ చేస్తతతాయి. తరువా ఫైర్‌బేస్‌ క్లౌడ్‌ మెసేజింగ్‌ ద్వారా డెవలపర్‌కు ఫుష్‌ మెసేజెస్‌ పంపుతుంటాయి. వాటి సాయంతో డెవలపర్‌ యూజర్‌కు తెలియకుండా బ్యాక్‌గ్రౌండ్‌లో పలు వెబ్‌సైట్లు ఓపెన్‌ చేసి ప్రకటనలపై క్లిక్‌ చేసి లబ్ది పొందుతున్నట్లు మెకాఫే తెలిపింది. దీని వల్ల యూజర్‌ ఫోన్‌ బ్యాటరీ, డేటా వినియోగం పెరుగుతుంది. కొన్ని సందర్భాల్లో మాల్‌వేర్‌ను యూజర్‌ డివైజ్‌లలో ప్రవేశపెట్టి వ్యక్తిగత సమాచారంతో పాటు బ్యాంకింగ్‌ వివరాలను దొంగిలించే అవకాశం ఉందని హెచ్చరించింది. గూగుల్‌ తొలగించిన ఈ యాప్‌లను ఇప్పటి వరకు 20 మిలియన్ల మంది యూజర్లు ఉపయోగి స్తున్నారు. యూజర్లు ఇప్పటికీ వీటిని ఉపయోగిస్తుంటే వెంటనే వీటిని తొలగించుకోవాలని గూగుల్‌ కోరింది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement