మన దేశ విదేశీ మారక నిల్వలు వరసగా ఐదు వారాలుగా తగ్గుతూ వస్తున్నాయి. జూన్ నెలలో 5.87 బిలియన్ డాలర్లు తగ్గి 590.588 బిలియన్ డాలర్ల విదేశీ మారక నిల్వలు ఉన్నాయి. ఈ సంవత్సరంలో ఇదే అత్యధిక తగ్గుదల. గత మూడు వారాలు చూస్తే తగ్గుదల 10.785 బిలియన్ డాలర్లుగా ఉంది. దిగుమతులు పెరగడం వల్లే విదేశీ మారక నిల్వలు తగ్గిపోతున్నాయని నిపుణులు అంచనా వేశారు. ప్రపంచ వ్యాప్తంగా ఆయా దేశాల కరెన్సీ విలువ డాలర్‌తో పోల్చితో తగ్గిపోతున్నాయి. ఈ నెలలో మొదటిసారిగా జపాన్ ఎన్ విలువ సైతం పడిపోయింది. ఈ సంవత్సరం ఫిబ్రవరి నెలలో రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన నాటి నుంచి మన రూపాయి విలువ అంతకంతకూ తగ్గిపోతూ వస్తోంది. దీని ప్రభావం మన విదేశీ మారక నిల్వల పై పడుతోంది.
శుక్రవారం నాడు డాలర్‌తో రూపాయి మారకపు విలువ 78.33 గా ఉంది. మన మార్కెట్ల నుంచి విదేశీ ఇన్వెస్టర్లు పెట్టుబడులను భారీ ఎత్తున ఉపసంహరించుకోవడం కూడా రూపాయి మారకం విలువపై పడుతుందని ఫోరెక్స్ వ్యాపారులు అభిప్రాయపడుతున్నారు. యూరో, పౌండ్, యన్‌తో కూడిన విదేశీ కరెన్సీ ఎసెట్స్ కూడా తగ్గిపోతున్నాయని ఆర్బీఐ ప్రకటించిన సమాచారం వెల్లడిస్తోంది. ఇవి ఈ వారంలో 5.362 బిలియన్ డాలర్లు తగ్గి, 526.882 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. బంగారపు నిల్వలు సైతం 258 మిలియన్ డాలర్లు తగ్గి 40.584 బిలియన్లుగా ఉన్నాయి. స్పెషల్ డ్రాయింగ్ రైట్స్(ఎస్‌డిఆర్) ఐఎంఎఫ్ 233 మిలియన్ డాలర్లు తగ్గి 18.155 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.