మన దేశం నుంచి బిస్మతి బియ్యం ఎగుమతులు గణనీయంగా తగ్గాయి. ఈ సంవత్సరం మొత్తం వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులు 50 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. వరసగా మూడు సంవత్సరాలుగా బస్మతి బియ్యం ఎగుమతులు తగ్గుతూ వస్తన్నాయి. 2019-20 సంవత్స రంతో పోల్చుకుంటే బాస్మతి బియ్యం ఎగుమతులు 3.53 బిలియన్ డాలర్ల మేర తగ్గిపోయాయి. ఎగుమతులు తగ్గినప్పటికీ మన దేశమే బాస్మతి బియ్యం ఎగుమతితో అగ్రస్థానంలో ఉంది. మన బాస్మతి బియాన్ని ఎక్కువగా దిముతి చేసుకునే ఇరాన్, యూరోపియన్ యూనియన్ మార్కెట్ల నుంచి ఆశించిన మేర డిమాండ్ లేకపోవడంతోనే ఎగుమతులు తగ్గినట్లు ఇంటర్నేషనల్ ట్రేడర్స్ తెలిపారు.
2017-18 సంవత్సరంలో 4.16 బిలియన్ డాలర్లు, 2018-19 సంవత్సరంలో 4.71 బిలియన్ డాలర్లు, 2019-20లో 4.37 బిలియన్ డాలర్లు, 2020-21లో 4.01 బిలియన్ డాలర్లు, 2021-22లో 3.53 డాలర్ల విలువైన బాస్మతి బియ్యం ఎగుమతులు జరిగాయి. దేశీయంగానే బాస్మతి బియ్యానికి డిమాండ్ పెరగడం, ఇతర బియ్యం రకాలకు అంతర్జాతీయ మార్కెట్లలో మంచి ధర రావడం కూడా ఒక కారణమని ట్రేడర్స్ తెలిపారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.