Saturday, November 23, 2024

Data Breach | 81.5 కోట్ల మంది భారతీయుల డేటా లీక్‌…పబ్లిక్‌ డొమైన్‌లోకి వ్యక్తిగత వివరాలు..

దేశ చరిత్రలోనే అతి పెద్ద డేటా లీక్‌ అన్నట్టుగా 81.5 కోట్ల మంది భారతీయుల వ్యక్తిగత వివరాలు డార్క్‌వెబ్‌ లో ప్రత్యక్షమయ్యాయి. ‘పిడబ్ల్యూఎన్‌0001’ అనే హ్యాకర్‌ చోరీ చేసిన సమాచారాన్ని డార్క్‌వెబ్‌లో పోస్ట్‌ చేయడంతో అతి పెద్ద డేటా లీక్‌ వెలుగులోకి వచ్చింది. కోవిడ్‌-10 పరీక్షల సందర్భంగా భారతీయ వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్‌) సేకరించిన డేటా ద్వారా కోట్లాది మంది భారతీయుల తాలూకు ఆధార్‌, పాస్‌పోర్ట్‌, తదితర వ్యక్తిగత వివరాలు లీక్‌ అయినట్టు హ్యకర్‌ తెలిపారు.

మొట్టమొదటగా డేటా లీక్‌ను సైబర్‌ సెక్యూరిటీ, ఇంటెలిజెన్స్‌లో ప్రత్యేకత సంతరించుకున్న అమెరికాకు చెందిన రీసెక్యూరిటీ అనే ఏజెన్సీ కనిపెట్టింది. ఆ తర్వాత భారత పౌరుల ఆధార్‌, పాస్‌పోర్ట్‌ వివరాలతో కూడిన 81.5 కోట్ల రికార్డులను అక్టోబర్‌ తొమ్మిదివ తేదీన ‘పిడబ్ల్యూఎన్‌0001’ హ్యాకర్‌ బైటపడ్డారు. ఒక అంచనా ప్రకారం ప్రస్తుతం భారత్‌ జనాభా 148 కోట్ల 60 లక్షలు.

కాగా భారతీయుల వ్యక్తిగత వివరాలతో కూడిన ఒక లక్ష ఫైళ్లలో ఉన్న ఆధార్‌ వివరాలను భారత ప్రభుత్వానికి చెందిన ఒక వెబ్‌సైట్‌లో ‘వెరిఫై ఆధార్‌’ (ఆధార్‌ను తనిఖీ చేసుకోండి) ద్వారా రీసెక్యూరిటీ పరిశోధకులు తనిఖీ చేయగా వారి వద్ద ఉన్న భారతీయుల ఆధార్‌ వివరాలు సరియైనవేనని తేలింది. డేటా లీక్‌పై భారత్‌కు చెందిన కంప్యూటర్‌ అత్యవసర స్పందన బృందం(సీయీఆర్‌టీ-ఇన్‌) సైతం ఐసీఎంఆర్‌ను అప్రమత్తం చేసిందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement