Tuesday, November 26, 2024

మైక్రోసాఫ్ట్‌, ట్విటర్‌ మధ్య డేటా వివాదం

టెక్‌ కంపెనీ మైక్రోసాఫ్ట్‌, ట్విటర్‌ మధ్య డేటా వివాదం చెలరేగింది. తమ డేటాను అక్రమంగా వినియోగిస్తోంద ని ఆరోపిస్తూ ట్విటర్‌ సీఈఓ సత్య నాదెళ్లకు ట్విటర్‌ ఒక లేఖ రాసింది. ట్విటర్‌ డేటా వినియోగం విషయంలో మైక్రోసాఫ్ట్‌ నిబంధనలు అతిక్రమిస్తోందని లేఖలో పేర్కొంది. దీనికి డబ్బుల చెల్లించేందుకు కూడా నిరాకరిస్తోందని ఆరోపించింది. నిబంధనల ప్రకారం ఉపయోగించుకోవాల్సిన డేటా కంటే మైక్రోసాఫ్ట్‌ అధికంగా ఉపయోగించుకుందని ట్విటర్‌ తన లేఖలో తెలిపింది. ఎలాంటి అనుమతి లేకుండానే తమ డేటాను ప్రభుత్వ ఏజెన్సీలతో పంచుకుంటున్నట్లు ఈ లేఖలో పేర్కొంది. అనేక రకాలుగా మైక్రోసాఫ్ట్‌ నిబంధనలు ఉల్లఘించిందని ఎలాన్‌ మస్క్‌ న్యాయవాది అలెక్స్‌ స్పైరో సత్య నాదెళ్లకు పంపిన లేఖలో ఆరోపించారు.

డేటాను ఉపయోగించుకుంటున్న మైక్రోసాఫ్ట్‌ నుంచి డబ్బులు వసూలు చేసేందుకే ట్విటర్‌ ఈ చర్య తీసుకుని ఉంటుందని టెక్‌ నిపుణులు భావిస్తున్నారు. ట్విటర్‌ను ఎలాన్‌ మస్క్‌ కొనుగోలు చేసిన తరువాత కంపెనీ ఖర్చులు తగ్గించుకునేందుకు, ఆదాయాన్ని పెంచుకునేందుకు అనేక చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా ఉద్యోగులను భారీ సంఖ్యలో తొలగించారు. ట్విటర్‌ బ్లూటిక్‌కు సబ్‌ స్క్రీప్షన్‌ విధానం తీసుకు వచ్చారు. ట్విటర్‌ కంటెంట్‌కు యూజర్లు డబ్బులు వసూలు చేసుకునేందుకు అనుమతించారు. ఇలా వచ్చిన డబ్బులో ట్విటర్‌ పర్నంటేజ్‌ తీసుకుంటోంది. తాజాగా తమ డేటా ఉపయోగించుకుంటున్న కంపెనీల నుంచి కూడా డబ్బులు వసూలు చేయాలని ట్విటర్‌ భావిస్తోంది. ఇందులో భాగంగానే మైక్రోసాఫ్ట్‌కు కూడా లాయర్‌లో లేఖ రాయించిందని వీరు అభిప్రాయపడుతున్నారు.

- Advertisement -

మైక్రోసాఫ్ట్‌పై గత నెలలో ఎలాన్‌ మస్క్‌ బహిరంగంగానే ఆరోపణలు చేశారు. కృత్రిమ మేథ సాంకేతికతను ట్రైయిన్‌ చేయడానికి ట్విటర్‌ డేటాను అక్రమంగా ఉపయోగించుకుంటోందని ఆయన ట్విట్‌ చేశారు. ట్విటర్‌ ఆరోపణలపై మైక్రోసాఫ్ట్‌ స్పందించింది. ఈ లేఖ అందిందని మైక్రోసాఫ్ట్‌ అధికార ప్రతినిధి ఫ్రాంక్‌ షా ధ్రవీకరించారు. లేఖను పరిశీలిస్తున్నామని, దీనిపై స్పందిస్తామని తెలిపారు. ట్విటర్‌తో దీర్ఘకాల భాగస్వామ్యాన్ని కొనసాగించేందుకు ప్రయత్నం చేస్తామని ఆయన స్పష్టం చేశారు.
చాట్‌జీపీటిని అభివృద్ధి చేసిన ఓపెన్‌ఏఐ విషయంలో ఎలాన్‌ మస్క్‌, మైక్రోసాఫ్ట్‌ మధ్య విబేధాల వచ్చాయి. ఈ కంపెనీలో మస్క్‌ కృషి కూడా ఉంది. 13 బిలియన్‌ డాలర్లు పెట్టుబడిపెట్టిన మైక్రోసాఫ్ట్‌ సంస్థ కార్యకలాపాలను నియంత్రిస్తోందని మస్క్‌ ఆరోపిస్తూ దాన్ని నుంచి బయటకు వచ్చారు. అప్పటి నుంచి ఎలాన్‌ మస్క్‌, మైక్రోసాఫ్ట్‌ మధ్య విబేధాలు కొనసాగుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement