Saturday, November 23, 2024

Layoffs | కొత్త సంవత్సరంలోనూ కోతలు.. ఐటీ, టెక్‌ సంస్థల్లో ఆందోళనలు

నూతన సంవత్సరం ప్రారంభమైన రెండు వారాల్లోనే కనీసం 46 ఐటీ, టెక్‌ కంపెనీలు (స్టార్టప్‌లతో సహా) 7,500 మందికి పైగా ఉద్యోగులను తొలగించాయి. జనరేటివ్‌ ఏఐ వినియోగం లక్షలాది ఉద్యోగాలకు ముప్పుగా పరిణమిస్తోంది. గత ఏడాది చివర్లో హాలిడే సీజన్‌లో కూడా కొనసాగిన గ్లోబల్‌ లేఆఫ్‌లు భారత ఉద్యోగులపై మరోసారి ప్రభావం చూపబోతున్నాయి. టెక్‌ సెక్టార్‌ ఉద్యోగాల కోతలను ట్రాక్‌ చేసే వెబ్‌సైట్‌ తాజా డేటా ప్రకారం, 46 టెక్‌ కంపెనీలు 7,528 మంది ఉద్యోగులను (జనవరి 14 వరకు) తొలగించాయి.

స్టార్టప్‌లతో సహా ప్రపంచవ్యాప్తంగా టెక్‌ కంపెనీలు 2022, 2023లో 425,000 కంటే ఎక్కువ మంది ఉద్యోగులను తొలగించాయి. భారతదేశంలో ఒకే సమయంలో 36,000 కంటే ఎక్కువ మంది ఉద్యోగులు ఇంటిదారి పట్టాల్సివచ్చింది.
కొత్తసంవత్సరంలో ఉద్యోగులను తొలగించిన మొదటి టెక్‌ స్టార్టప్‌గా ఆన్‌లైన్‌ రెంటల్‌ ప్లాట్‌ఫారమ్‌ ఫ్రంట్‌డెస్క్‌ అవతరించింది. ఇది మొత్తం 200 మందిని ఇంటికి పంపేసింది.

- Advertisement -

గేమింగ్‌ కంపెనీ యూనిటీ తాజాగా 25 శాతం మంది ఉద్యోగులను (1,800 మంది) తొలగిస్తున్నట్లు ప్రకటించింది. హార్డ్‌వేర్‌, కోర్‌ ఇంజనీరింగ్‌, గూగుల్‌ అసిస్టెంట్‌ టీమ్‌లలో అనేక వందల ఉద్యోగాలను తగ్గించినట్లు గూగుల్‌ గతవారం ధృవీకరించింది. అమెజాన్‌ యాజమాన్యంలోని ఆడియోబుక్‌, పాడ్‌కాస్ట్‌ డివిజన్‌ ఆడిబుల్‌లో మొత్తం 100 మందికి పైగా ఉద్యోగులను తొలగిస్తోంది. మెటా ఇన్‌స్టాగ్రామ్‌లో కొంతమంది టెక్నికల్‌ ప్రోగ్రామ్‌ మేనేజర్‌లను తొలగించి నూతన సంవత్సరాన్ని ప్రారంభించింది.

కనీసం 60 ఉద్యోగాలు తొలగించబడుతున్నాయని నివేదికలు తెలిపాయి. గ్లోబల్‌ డేటా మేనేజ్‌మెంట్‌ సొల్యూషన్స్‌ ప్రొవైడర్‌ వీమ్‌ సాప్ట్‌nవేర్‌ 300 మంది ఉద్యోగులను తొలగించినట్లు సమాచారం. డిస్నీ యాజమాన్యంలోని యానిమేషన్‌ స్టూడియో పిక్సర్‌ కూడా ఈ ఏడాది ఉద్యోగాలను తగ్గించబోతున్నట్లు మీడియా నివేదించింది. గ్లోబల్‌ బ్యాంకింగ్‌ మేజర్‌ సిటీ గ్రూప్‌ రాబోయే రెండేళ్ళలో తన శ్రామికశక్తిలో 10 శాతం లేదా దాదాపు 20,000 మంది ఉద్యోగులను తగ్గించనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement