ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థల్లో అనిశ్చితి నెలకొంది. స్టాక్ సూచీలు పాతాళానికి నెట్టేయబడుతున్నాయి. ఇదే సమయంలో క్రిఎ్టో కరెన్సీ కూడా భారీగా పతనంఅవుతున్నది. 24 గంటల్లో క్రిఎ్టో కరెన్సీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 1.7 ట్రిలియన్ డాలర్ల నుంచి 1.6 ట్రిలియన్ డాలర్లకు పడిపోయింది. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు.. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన క్రిఎ్టో.. ఏమేర ఒత్తిడి ఎదుర్కొంటున్నదో.. నవంబర్‌లో క్రిఎ్టో కరెన్సీ పరుగులు పెట్టింది. 69వేల డాలర్లకు చేరుకుంది. ఇప్పుడు చూసుకుంటే అందులో సగానికి పడిపోయింది. బిట్ కాయిన్‌తో పాటు ఇతర క్రిఎ్టో కరెన్సీలైన ఈథిరియం, డోగికాయిన్, శిబా, ఇను, సొలానా వంటివి భారీగా పతనం అవుతున్నాయి. రష్యా క్రిఎ్టో మైనింగ్, ట్రేడింగ్ నిషేధాన్ని ప్రతిపాదించిన తరువాత.. క్షీణిస్తూ వస్తున్నాయి. బ్లూమ్‌బర్గ్ స్టూడియో హోస్ట్ అయిన ఎమిలీ చాంగ్‌తో నాస్‌డాక్ లిస్టెడ్ బిజినెస్ ఇంటెలిజెన్స్ కంపెనీ మైక్రో స్ట్రాటజీ ఇంక్ సహ వ్యవస్థాపకుడు, సీఈఓ మైఖేల్ జే సేలర్ క్రిఎ్టో కరెన్సీ క్రాషింగ్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. దీనికి రెండు కారణాలు తెలిపారు. క్రిఎ్టోపై సేలర్ చేసిన వ్యాఖ్యలు తెగ వైరల్ అవుతున్నాయి.
పతనానికి రెండు కారణాలు
మైఖేల్ జే సేలర్ మాట్లాడుతూ.. క్రిఎ్టో మార్కెట్ భారీగా పతనం అవుతుండటానికి రెండు కారణాలు ఉన్నాయి. ఇక్కడ చాలా డైనమిక్‌లు ఉన్నాయని నేను భావిస్తున్నాను. మొత్తం క్రిఎ్టో ఎకోసిస్టమ్‌ను చూస్తే.. రెగ్యులేటరీ అనిశ్చితి స్పష్టంగా కనిపిస్తుంది. ప్రత్యేకించి.. స్టేబుల్ కాయిన్‌లు, క్రిఎ్టో టోకెన్‌ల చుట్టూ రెగ్యులేటరీ అనిశ్చితి నెలకొంది. అవి అంత ఆర్థికపరమైన భద్రత ఇవ్వవనే వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో మదుపరుల్లో కొంచెం ఆందోళన నెలకొంది. వికేంద్రీకృత ఫైనాన్స్ (డిఫీ) ఎక్స్ఛేంజీల ఏర్పాటు.. ఎలా క్రిఎ్టో కరెన్సీని మరింత అస్థిరంగా మార్చిందో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. డిఫీ అనేది.. సాంప్రదాయ ఆర్థిక సంస్థలు. బ్యాంకింగ్ చుట్టూ నిర్మించబడిన నియంత్రణ నిర్మాణాల నుంచి స్వతంత్రంగా క్రిఎ్టో కరెన్సీని బదిలీ చేయడం, వ్యాపారం చేయడం, రుణం తీసుకోవడం, రుణాలు ఇవ్వడం వంటి ప్రత్యామ్నాయ ఆర్థిక వ్యవస్థ. లావాదేవీల నుంచి నమ్మకం, మధ్యవర్తుల అవసరాన్ని తొలగించడానికి కంప్యూటర్ కోడ్‌ను ఉపయోగించి, ఫైనాన్స్‌ను డిస్ ఇంటర్మీడియేట్ చేయడం డిఫీ ముఖ్య ఉద్దేశం.
ఇన్వెస్టర్లకు ఎంట్రీ పాయింట్
ఆర్థిక వ్యవస్థలో చాలా క్రిఎ్టో ఎక్స్ఛేంజీలు ఉన్నాయి. వీటికి, డిఫీ ఎక్స్ఛేంజీల మధ్య లీవరేజ్ ఎక్కువగా పొందొచ్చు. ఇది కూడా అస్థిరతకు కారణంగా చెప్పుకోవచ్చు. ప్రస్తుత మార్కెట్ పరిస్థితులను బట్టి చూస్తే.. క్రిఎ్టో క్యూరియస్ ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లకు మంచి ఎంట్రీ పాయింట్‌ను అందిస్తాయని భావించొచ్చు. సంస్థాగత పెట్టుబడిదారులకు ఇది మంచి ఎంట్రీ. కొన్ని కంపెనీలు, వారి యజమానులతో కూడా మాట్లాడటం జరిగింది. 2021లో క్రిఎ్టో పరుగులు పెట్టింది. 400 శాతం పెరిగితే.. దాన్ని పొందడానికి చాలా మంది భయపడుతారు. ఆగస్టులో మైక్రో స్ట్రాటజీ.. 250 మిలియన్లు విలువ చేసే బిట్ కాయిన్‌లు కొనుగోలు చేసినట్టు ప్రకటించింది. 1,24,391 బిట్‌కాయిన్‌లను కంపెనీ కలిగి ఉంది. దీని విలువ సుమారు 4.85 బిలియన్ డాలర్లకు చేరుకుంది.